తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ ల్యాప్​టాప్​ కొత్తదానిలా తళతళ మెరవాలా? ఈ సింపుల్​ టిప్స్​ ట్రై చేయండి - Laptop Cleaning Liquid

Laptop Cleaning Tips In Telugu : ల్యాప్​టాప్​- ప్రస్తుత కాలంలో దీని వాడకం చాలా ఎక్కువైపోయింది. సాధారణంగా ల్యాప్​టాప్​కు వైరస్​ నుంచి రక్షించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే దానిని శుభ్రంగా ఉంచే విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తాం. ఇలా ల్యాప్​టాప్​లను క్లీన్​ చేయకపోవటం వల్ల వాటి జీవిత​​ కాలం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ల్యాప్​ట్యాప్​ను జాగ్రత్తగా ఎలా శుభ్రపరచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Laptop Cleaning Tips
Laptop Cleaning Tips

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 9:00 AM IST

Laptop Cleaning Tips In Telugu : ఈ 5జీ కాలంలో ల్యాప్​టాప్ అనేవి సర్వ సాధారణమైన గ్యాడ్జెట్​గా మారిపోయింది. ఆన్​లైన్​ క్లాసుల పుణ్యమా అని విద్యార్థులు, వర్క్​ఫ్రమ్​ హోం అని ఉద్యోగస్థులు వీటితో తీరిక లేకుండా గడుపుతున్నారు. సాధారణంగా కంప్యూటర్​లను ఫాస్ట్​గా ఉంచాలని వైరస్​లను గుర్తించటం వాటిని తొలగించటం తరచుగా రిఫ్రెష్ చేయటం లాంటివి చేస్తుంటాం. అయితే ల్యాప్​టాప్​లను కూడా ఫిజికల్​గా శుభ్రపరచకపోతే అవి పాడైపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు గ్యాడ్జెట్స్​ నిపుణులు. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్​గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

వాక్యూమ్​ క్లీనర్​ను వాడవచ్చు
ల్యాప్​టాప్​ క్లీనింగ్​కు వాక్యూమ్​ క్లీనర్​ను వినియోగించవచ్చు. దీంతో దాని విడి భాగాలలో పేరుకుపోయిన దుమ్ము వెళ్లిపోతుంది. సాధారణంగా ల్యాప్​టాప్ స్క్రీన్​తో పాటు దాని విడి భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఒకవేళ వాటిని బ్రష్​లు లేదా ఇతర వాటితో శుభ్రపరిస్తే స్క్రీన్​పై గీతలు పడటమే కాకుండా దాని ఇతర భాగాలూ డ్యామేజ్​ అయ్యే అవకాశం ఉంది. అందుకే వాక్యూమ్​ క్లీనర్ వాడటం మంచిది. అయితే దీనిని శుభ్రపరుస్తున్నప్పుడు వాక్యూమ్​ క్లీనర్​ను తక్కువ స్పీడ్​లో పెట్టడం మాత్రం మరిచిపోకండి.

కీ బోర్డును క్లీన్​ చేయండి
ల్యాప్​టాప్​ కీబోర్డును వాక్యూమ్​ క్లీనర్​తో క్లీన్ చేయండి. సాధారణంగా కీబోర్డుపై ఉండే బటన్​ల మధ్య దుమ్ము చేరి ఉంటుంది గనుక దానిని జాగ్రత్తగా శుభ్రపరచండి. అనంతరం తడి ఉన్న ఏదైనా క్లాత్​తో కీబోర్డును శుభ్రం చేయండి.

ల్యాప్​టాప్​ పోర్టల్స్​ను శుభ్రపరచండి
ల్యాప్​టాప్​ను వాక్యూమ్​ క్లీనర్​తో శుభ్రపరిచిన తరువాత దానిని మార్కెట్​లో దొరికే ఐసోప్రొపైల్ ఆల్కహాల్​తో క్లీన్ చేయటం మంచిది. దాని వల్ల స్క్రీన్​పై లేదా ఇతర భాగాలపై కనిపించకుండా ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి.

ల్యాప్​టాప్ స్క్రీన్​ క్లీన్​
ల్యాప్​టాప్​ స్క్రీన్​ అనేది చాలా సున్నితమైన భాగం. గనుక దానిని శుభ్రపరచడానికి ఒక బట్ట ముక్క తీసుకొని దానిని కొంత ఐసోప్రొపైల్​ ఆల్కహాల్​తో తడిపి జాగ్రత్తగా తుడవాలి. ఒకవేళ మీ ల్యాప్​టాప్ టచ్​స్క్రీన్​ అయితే ఈ రసాయనాన్ని ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. ఈ విధంగా శుభ్రం చేయటం వల్ల మీ స్క్రీన్​పై ఎటువంటి దుమ్మూధూళి నిలవదు.

తరచూ శానిటైజ్ చేయండి
ఒకసారి మీ ల్యాప్​టాప్​ స్క్రీన్​ను క్లీన్ చేసిన అనంతరం అదే ఐసోప్రొపైల్ రసాయనంతో మరోసారి ల్యాప్​టాప్​ అద్దాన్ని మరోసారి శానిటైజ్​ చేయండి. దీంతో మీ ల్యాప్​టాప్​ శుభ్రంగా ఉండటమే కాకుండా ఎల్లప్పుడూ కొత్త దానిలా కన్పిస్తుంది. ఇలా వారానికి ఒకసారి చేయటం వల్ల మీ ల్యాప్​టాప్ సర్వీస్ కూడా​ పెరుగుతుంది.

ఈ బెస్ట్ ఏఐ టూల్స్​తో మీ జీవితమే మారుపోతుంది!

రూ.15వేలు బడ్జెట్లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే!

ABOUT THE AUTHOR

...view details