తెలంగాణ

telangana

ETV Bharat / technology

'రోజుకి 1.35 కోట్ల ఫ్రాడ్ కాల్స్- బ్లాక్ చేయడంతో రూ. 2,500 కోట్ల ఆస్తి సేఫ్'

అద్భుతంగా పనిచేస్తున్న స్పామ్ ట్రాకింగ్ సిస్టమ్- ఇకపై ఫేక్ కాల్స్ టెన్షన్ లేదు గురూ..!

Jyotiraditya Scindia
Jyotiraditya Scindia (IANS, X/@DoT_India)

By ETV Bharat Tech Team

Published : Nov 11, 2024, 7:46 PM IST

Updated : Nov 11, 2024, 7:53 PM IST

Jyotiraditya Scindia: ప్రభుత్వం తీసుకొచ్చిన 'స్పామ్ ట్రాకింగ్ సిస్టమ్'తో ప్రతిరోజూ 1.35 కోట్ల ఫ్రాడ్ కాల్స్​ను బ్లాక్ చేయగలుగుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. దీనితో ఇప్పటివరకు ప్రజలు రూ. 2,500 కోట్ల విలువైన ఆస్తి సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా కాపాడగలిగామని అన్నారు. చాలా స్పామ్ కాల్స్ దేశం వెలుపల ఉన్న సర్వీస్​ల నుంచి వస్తున్నాయని, ఇటువంటి మోసపూరిత కాల్స్​ను ఈ టెక్నికల్ సిస్టమ్ బ్లాక్ చేయగలుగుతోందని చెప్పారు.

సంచార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాథీ, చక్షు పోర్టల్​ ద్వారా డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూకేషన్ (డాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిటెక్షన్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.2,500 కోట్ల విలువైన ప్రజల ఆస్తులను రక్షించిందని వివరించారు. ఈ వ్యవస్థలతో దాదాపు 2.9 లక్షల ఫేక్ ఫోన్ కనెక్షన్లు డిస్‌కనెక్ట్ అయ్యాయని, మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పంపడానికి ఉపయోగించే దాదాపు 1.8 మిలియన్ హెడర్లను బ్లాక్ చేయగలిమని తెలిపారు.

వీటితోపాటు ప్రభుత్వం మరో కొత్త సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసిందని, ఇందులో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో పాటు బ్యాంకులను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. ఇందులో 520 ఏజెన్సీలను చేర్చామని తెలిపారు. సింధియా తన ప్రాధాన్యతలను వివరిస్తూ.. వచ్చే ఏడాది మే నాటికి BSNL 5G, ఏప్రిల్ నాటికి 4G సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందరికీ అందేలా చేయడమే తమ మరో లక్ష్యమన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్ 4G కోసం లక్ష బేస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికాబద్ధంగా పనులు జరుగుతున్నాయని, వీటిలో 50 వేల టవర్ల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నాటికి లక్ష బేస్​ స్టేషన్లు ఇన్​స్టాల్​ చేస్తామని అన్నారు. దీంతో స్వదేశీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అమలు చేసిన దేశంలో మొదటి ఆపరేటర్​గా BSNLనిలుస్తుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి 5జీ అమలుపై దృష్టి పెడతామని తెలిపారు.

ఈ సైట్‌లు 2025 నాటికి 5Gకి అప్‌గ్రేడ్ అవుతాయని సమాచారం. ఇందుకోసం అదనపు టవర్లను ఏర్పాటు చేయడంతో పాటు టెక్నాలజీ కోర్​ను కొద్దిగా మారిస్తే సరిపోతుందని సింధియా అన్నారు. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-మే నాటికి కొన్ని ఏరియాల్లో బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5జీ అమల్లోకి రావొచ్చు.

"బీఎస్​ఎన్​ఎల్​ను టాప్ టెలికాం కంపెనీగా మార్చడమే ప్రభుత్వం టార్గెట్. దీనిలో భాగంగా దాని మార్కెట్ షేర్​ను, సబ్​స్క్రైబర్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 4జీ కనెక్టివిటీని అందించడమే మరో లక్ష్యం. ఇండియాలోని 37 వేల గ్రామాలకు ఇంకా 4జీ కనెక్టివిటీ లేదు. ఏప్రిల్ నాటికి అన్ని ప్రాంతాలకు 4జీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందేలా చేయడం మా టాప్ ప్రయారిటీ."- జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి

స్పామ్ కాల్స్ వేధిస్తున్నాయా?- డోంట్​ వర్రీ- కేంద్రం పక్కా స్కెచ్​తో వచ్చిందిగా..!

జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలకు షాక్- దేశంలో BSNL 5G సేవలు షురూ!

Last Updated : Nov 11, 2024, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details