తెలంగాణ

telangana

ETV Bharat / technology

జియో నుంచి చీపెస్ట్ ప్లాన్ మళ్లీ వచ్చేసిందోచ్- అన్​లిమిటెడ్ కాలింగ్, డేటా ప్రయోజనాలతో ఇక పండగే! - JIO RS189 RECHARGE PLAN

జియో యూజర్లకు గుడ్​న్యూస్- తన చౌకైన నెలవారీ రీఛార్జ్​ ప్లాన్​ను తీసుకొచ్చిన కంపెనీ!

Jio Reintroduced the Old Plan
Jio Reintroduced the Old Plan (Photo Credit- Getty Image)

By ETV Bharat Tech Team

Published : Feb 11, 2025, 5:39 PM IST

Jio Rs.189 Recharge Plan:జియో తన చౌకైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌ను మళ్లీ ప్రారంభించింది. రిలయన్స్ జియో తన యాప్‌లో ఇప్పుడు ఈ ప్లాన్‌ని లైవ్ చేస్తోంది. మై జియో యాప్ వాల్యూ సెక్షన్​కు వెళ్తే మీకు ఈ ప్లాన్​ కన్పిస్తుంది. ఈ ప్లాన్​ ధర కేవలం రూ.189 మాత్రమే. కంపెనీ ఈ ప్లాన్​తో వినయోగదారులకు అన్​లిమిటెడ్ కాలింగ్​తో పాటు డేటా, SMS ప్రయోజనాలను అందిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మీకోసం.

జియో చౌకైన రీఛార్జ్ ప్లాన్:రిలయన్స్ జియో రూ. 189లతో తీసుకొచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్​ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ 28 రోజుల పాటు అన్​లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్​తో యూజర్లకు మొత్తం 300 SMS, 2GB డేటా లభిస్తుంది. వీటితో పాటు ఈ ప్లాన్​లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే (TRAI) అన్ని టెలికాం కంపెనీలను కాలింగ్, SMS ఓన్లీ ప్లాన్​లను మాత్రమే ప్రారంభించమని కోరింది. దీంతో ఇటీవలే జియో, ఎయిర్​టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలు కేవలం కాలింగ్, SMSల కోసం మాత్రమే కొత్త రీఛార్జ్ ప్లాన్​లను ప్రారంభించాయి. ఈ క్రమంలో జియో తన వెబ్​సైట్​ అండ్ యాప్ నుంచి రూ. 189 ఈ చౌకైన రీఛార్జ్​ ప్లాన్‌ను తొలగించింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ ప్లాన్​ను మళ్లీ యాక్టివేట్ చేసింది.

ఇక ట్రాయ్ ఆదేశాల ప్రకారం జియో ఇటీవలే వాయిస్ కాలింగ్, SMS కోసం మాత్రమే రెండు రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ రెండు ప్లాన్‌ల ధరలు రూ. 448, రూ. 1748.

జియో రూ.448 ప్లాన్‌:ఈ ప్లాన్​ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ 84 రోజుల పాటు వినియోగదారులు అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 1000 SMSలు లభిస్తాయి.

జియో రూ. 1748 ప్లాన్‌: జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్​336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్​తో మీరు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అన్​లిమిటెడ్ కాలింగ్, మొత్తం 3600 SMSలు పొందుతారు.

మిస్సైల్ నుంచి మైక్రోబయాలజీ వరకు మహిళదే హవా- విజ్ఞాన రంగంలో మన దేశ ధీర వనితలు వీరే!

సేఫర్ ఇంటర్నెట్​ డే: నెట్టింట్లో బీ కేర్​ఫుల్- ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

సునీతా రాకపై సర్వత్రా ఉత్కంఠ- షెడ్యూల్ కంటే ముందుగానే భూమికి!- ఎలాగంటే?

ABOUT THE AUTHOR

...view details