JIO Safe and JIO Translate :ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో రెండు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అవి: జియో సేఫ్, జియో ట్రాన్స్‌లేట్. వీటిని ఉపయోగించాలంటే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. జియో సేఫ్ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.199. జియో ట్రాన్స్‌లేట్ చందా రూ.99గా ఉంది. జియో యూజర్లతో మాత్రమే కాదు, ఇతరులు కూడా వీటిని సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అయితే జియో యూజర్లకు వీటిని ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నట్లు జియో పేర్కొంది.
JIO Safe :ఇది జూమ్ లాంటి ఒక కమ్యునికేషన్ యాప్. దీనితో వాయిస్, వీడియో, కాన్ఫరెన్స్ కాలింగ్ చేసుకోవచ్చు. ఏదైనా మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ కావచ్చు. ఐదుగురు సభ్యులతో గ్రూప్ కాలింగ్ చేసుకోవచ్చు.
JIO Translate : ఇది అనువాదానికి సంబంధించిన జియో యాప్. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ మొదలైన 12 భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా మీ మాటలను టెక్ట్స్ రూపంలోకి మార్చుకోవచ్చు. వాయిస్ కాల్‌లో ఉంటూనే ఆడియోను ట్రాన్సలేట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాంట్ వాయిస్ ట్రాన్సలేట్ ఆప్షన్ ఇందులో ఉంది. పర్యటకులకు, కొత్త ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ యాప్ అనువుగా ఉంటుంది.
JIO Plans : రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్ ధరలను ఇటీవలే భారీగా పెంచింది. సవరించిన ప్లాన్లు ఈ జులై 3 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ లోపు రీఛార్జ్ చేసుకున్న వారికి పాత ధరలే వర్తిస్తాయి.
- జియో ఛార్జీలు పెంచిన నేపథ్యంలో 28 రోజుల ప్లాన్ కనీస రీఛార్జ్ మొత్తం రూ.189కు చేరింది.
- 84 రోజుల ప్లాన్ ధర విషయానికి వస్తే, జియో ప్లాన్ ధర రూ.666 నుంచి రూ.799కి పెరిగింది. ఇవేకాదు డేటా ప్లాన్స్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ధరలు కూడా భారీగా పెరిగాయి.
ఇకపై నో ఫ్రీ 5జీ డేటా!
జియో ఇప్పటి వరకు అందరు యూజర్లకు 5జీ డేటాను ఉచితంగా, అపరిమితంగా ఇస్తూ వస్తోంది. కానీ ఇకపై 5జీ డేటాపై పరిమితులు విధిస్తున్నట్లు తెలిపింది. ఎవరైతే 2 జీబీ కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తారో, వారికి మాత్రమే అపరిమిత 5జీ డేటాను అందించున్నట్లు స్పష్టం చేసింది. దీని వల్ల ఇకపై 5జీ ఫోన్ ఉండి అపరిమిత డేటా ఆనందించాలంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే జియో యూజర్లు 84 రోజులకుగాను రూ.859తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
జియో Vs ఎయిర్‌టెల్ Vs వీఐ ప్లాన్స్ ధరలు పెంపు - ఇకపై వారికి మాత్రమే 5జీ! - JIO VS AIRTEL VS VI PLANS 2024
గూగుల్ క్రోమ్‌లో 5 నయా ఫీచర్స్ - ఇకపై సెర్చింగ్ వెరీ సింపుల్! - Latest Google Chrome Features