Jawa Yezdi 42 FJ350 Launched:ప్రీమియం బైక్ మేకర్ జావా యెజ్డీ మంగళవారం తన లేటెస్ట్ మోడల్ జావా 42 FJ350ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. మోడ్రన్ రెట్రో థీమ్‌తో స్పోర్టీ లుక్‌లో ఈ బైక్‌ను డిజైన్ చేశారు. ఈ మోడల్ బైక్‌కు దాని వ్యవస్థాపకుడు ఫ్రాంటిసెక్ జానెసేక్ పేరు పెట్టారు. ఈ లేటెస్ట్ వెర్షన్ బైక్ మార్కెట్లో అయిదు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే జావా 42 FJ350 బుకింగ్స్ ప్రారంభమయ్యాయని జావా కంపెనీ ప్రకటించింది. త్వరలో డెలివరీని ప్రారంభించనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో పండుగ సీజన్ ప్రారంభమయ్యేలోపు దేశవ్యాప్తంగా మరో 100 కొత్త స్టోర్లను తెరవాలని జావా యెజ్డీ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ధర, ఇంజిన్, ఫీచర్స్ వంటి సమాచారం మీకోసం.
Jawa Yezdi 42 FJ350 Features:
- ఇంజిన్:334 సీసీ
- పవర్:21.45 బిహెచ్పి
- టార్క్:29.62 ఎన్ఎమ్
- ట్రాన్స్ మిషన్: 6 గేర్లు
- ఛాసిస్:స్టీల్
- టెలిస్కోపిక్ ఫోర్క్: 41 ఎంఎం
- ఇంజిన్ స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో 6- స్పీడ్ గేర్‌బాక్స్
- LED లైట్స్
- USB ఛార్జింగ్ పోర్ట్
- ట్విన్ షాక్ అబ్జార్బర్స్
- ఆఫ్‌సెట్ స్పీడోమీటర్
- మెరుగైన హ్యాండ్లింగ్ కోసం డబుల్ గ్రిల్ ఫ్రేమ్
- బైక్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు
- కాంటినెంటల్ ఏబీఎస్ సిస్టం
- వాహనం హైస్పీడ్‌లో ఉన్నప్పుడు భద్రత కోసం బ్రాంబో బ్రేక్‌లు
- కలర్ ఆప్షన్స్: జావా 42 FJ350 బైక్ మార్కెట్లో అయిదు రంగుల్లో అందుబాటులో ఉంది.
- ధర: రూ.1,99,142 (దిల్లీ ఎక్స్-షోరూం)
మోడ్రన్ రెట్రో థీమ్: జావా 42 FJ350 బైక్‌ను మోడ్రన్ రెట్రో థీమ్‌తో డిజైన్ చేశారు. దాని సైడ్ ప్యానల్స్ జావా 42 మాదిరిగానే ఉన్నాయి.