తెలంగాణ

telangana

ETV Bharat / technology

శ్రీహరికోట వేదికగా ఇస్రో 100వ మిషన్​లో సాంకేతిక లోపం- మొరాయిస్తున్న NVS-02 శాటిలైట్! - ISRO NVS 02 SATELLITE SETBACK

కక్ష్యలోకి వెళ్లేందుకు మొరాయించిన శాటిలైట్- ఇస్రో ప్రయత్నాలు విఫలం

ISRO NVS 02 Satellite Suffers Setback Thrusters Fail to Fire
ISRO NVS 02 Satellite Suffers Setback Thrusters Fail to Fire (Photo Credit- PTI)

By ETV Bharat Tech Team

Published : Feb 3, 2025, 3:26 PM IST

Updated : Feb 3, 2025, 3:32 PM IST

ISRO NVS 02 Satellite Setback:శ్రీహరికోట వేదికగా ఇస్రో గత నెలలో 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అయితే మిషన్​లో సాంకేతిక లోపం తలెత్తడంతో NVS​-02 శాటిలైట్​ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. శాటిలైట్​లోని థ్రస్టర్లు (ఇంజిన్లు) ప్రజ్వరిల్లకపపోవడమే ఇందుకు కారణమని ఇస్రో ఆదివారం తన సోషల్ మీడియా ప్లాట్​ఫారమ్ వేదికగా వెల్లడించింది.

భారత ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్‌ వ్యవస్థలో ఎన్‌వీఎస్‌-02 శాటిలైట్ చాలా కీలకం. ఇది దేశ నావిగేషనల్ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ శాటిలైట్ భూమి, వైమానిక, సముద్ర.. నావిగేషన్, మొబైల్ డివైజెస్​లో లొకేషన్-బేస్డ్ సర్వీసులు, ఇంటర్నెట్-ఆఫ్-థింగ్స్ (IoT) బేస్డ్ అప్లికేషన్స్, ఎమర్జెన్సీ అండ్ టైమ్ సర్వీసులను అందించేందుకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో 2,250 కిలోల ఈ NVS-02 ఉపగ్రహాన్ని పదేళ్లపాటు సేవలు అందించేలా ఇస్రో రూపొందించింది. ఇది L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్​ను కలిగి ఉంది. అంతేకాక ఇది NVS-01 మాదిరిగా అదనపు C-బ్యాండ్​లో కూడా పేలోడ్‌ను కలిగి ఉంది.

ఈ కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాన్ని GSLV-F15 రాకెట్‌ ద్వారా గత నెల 29న నింగిలోకి ప్రయోగించారు. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) తన 17వ ప్రయోగంలో స్వదేశీ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ NVS-2 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఈ క్రమంలో అనుకున్నట్లుగా దీన్ని నిర్దేశిత కక్ష్యలో చేర్చే ప్రక్రియను ఇస్రోశాస్త్రవేత్తలు ఆదివారం చేపట్టారు. ఇందుకోసం ఉపగ్రహం ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి వాటిని మండించేందుకు ప్రయత్నించారు. కానీ ఇంజిన్లలోకి పంపే వాల్వ్‌లు తెరుచుకోలేదు. దీంతో ఇంజిన్లు ప్రజ్వరిల్లకపోవడంతో ఇస్రో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ శాటిలైట్ జియోసింక్రోనస్ ట్రాన్సఫర్ ఆర్బిట్ (భూఅనువర్తిత బదిలీ కక్ష్య- జీటీవో)లో పరిభ్రమిస్తోంది. నేవిగేషన్‌ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు ఈ కక్ష్య అనువైనది కాదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇస్రో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శాటిలైట్ పనితీరులో ఎటువంటి లోపం లేదని, దాని వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది.

బాల్యం నుంచే స్మార్ట్​ఫోన్- యవ్వనంలో మతి చెడిపోతుందట!

ఈవీ రంగంపై కేంద్రం వరాల జల్లు- ఇకపై తగ్గనున్న ఎలక్ట్రిక్ కార్లు, బైక్​లు, ఫోన్​ల ధరలు!

ఎడ్యుకేషన్​లోనూ ఏఐ- రూ.500కోట్లు కేటాయించిన కేంద్రం

Last Updated : Feb 3, 2025, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details