Is Gmail Going To Shut Down In 2024 : ప్రస్తుతం సోషల్ మీడియాలో 'జీమెయిల్ షట్ డౌన్ న్యూస్' ట్రెండింగ్ అవుతోంది. గూగుల్ సంస్థ ఈ 2024 ఆగస్టులో జీమెయిల్ సేవలు నిలిపివేస్తున్నట్లు సామాజిక వేదికల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఇది వాస్తవమేనా? లేదా కేవలం ఒక రూమరేనా?
రూమర్ మాత్రమే!
గూగుల్ కంపెనీ త్వరలో జీమెయిల్ సర్వీసెస్ నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది కూడా ఈ 2024 ఆగస్టు 1తోనే ఈ సేవలు ముగుస్తాయని రూమర్ స్ప్రెడ్ అయ్యింది. దీనితో జీ మెయిల్ యూజర్లు చాలా ఆందోళనకు గురయ్యారు. మొదట్లో దీనిపై గూగుల్ కంపెనీ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చివరికి జీమెయిల్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో 'జీమెయిల్ సేవలు ఇకపైనా కొనసాగుతాయి' అని చిన్న సందేశాన్ని పోస్ట్ చేసింది. దీనితో జీమెయిల్ సేవలు నిలిచిపోతాయనే వార్త ఒక రూమర్ అని తేలిపోయింది.
జీమెయిల్ సేవలు ఆగిపోతే పరిస్థితి ఏమిటి?
జీమెయిల్ సేవలు ఆగిపోతే డిజిటల్ మార్కెట్లో ఎంతో గందరగోళం ఏర్పడుతుంది. ఎందుకంటే జీమెయిల్‌ను వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే కాకుండా, వ్యాపారాల కోసం, సబ్స్క్రిప్షన్ల కోసం ఉపయోగిస్తూ ఉంటారు.