తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ రివీల్!- కెమెరా మాడ్యూల్ ఎలా ఉందో తెలుసా? - IPHONE 17 PRO AND IPHONE 17 DESIGN

ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మోడల్ రెండర్స్ లీక్- పూర్తి వివరాలు ఇవే!

iPhone 17 Pro and iPhone 17 Design Leaked
iPhone 17 Pro and iPhone 17 Design Leaked (Photo Credit- FrontPageTech/ @asherdipps and X/@MajinBuOfficial)

By ETV Bharat Tech Team

Published : Feb 16, 2025, 7:47 PM IST

Updated : Feb 16, 2025, 8:01 PM IST

iPhone 17 Pro and iPhone 17 Design Leaked:యాపిల్ ఇప్పట్లో తన ఐఫోన్ 17 సిరీస్​ ఫోన్​లను లాంఛ్ చేసే అవకాశం లేదు. వీటి రిలీజ్​కు ఇంకా చాలా నెలల సయయం ఉంది. అయితే ఈ వీటి వివరాలు మాత్రం ఇప్పటికే ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సిరీస్​లోని రెండు మోడల్స్​ అంటే 'ఐఫోన్ 17', 'ఐఫోన్ 17 ప్రో' ఫోన్​ల రెండర్స్ విడి విడిగా లీక్ అయ్యాయి.

అవి ఈ ఐఫోన్​లు రియర్​ ప్యానెల్​లో అడ్డుగా సాగదీసినట్లుగా ఉన్న కెమెరా బార్​ను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి. లీకైన ఒక రెండర్​లో క్షితిజ సమాంతరంగా అమర్చిన రెండు వెనక కెమెరాలతో 'ఐఫోన్ 17' కన్పిస్తుంది. అయితే దీని 'ప్రో' మోడల్ దాని ప్రీవియస్ 'ఐఫోన్ 16 ప్రో' మాదిరిగానే కెమెరా లేఅవుట్‌ను కలిగి ఉంటుందని మరో లీక్డ్ రెండర్ సూచిస్తుంది.

ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో డిజైన్ (లీక్డ్):స్టాండర్డ్ 'ఐఫోన్ 17' మోడల్ రెండర్​ను యూజర్ @MajinBuOfficial తన సామాజిక మాధ్యమం ఎక్స్​లో పోస్ట్​ చేశారు. అందులో కన్పిస్తున్న ఇమేజ్​ను చూస్తే ఈ ఫోన్​ రీడిజైన్డ్ రియర్ కెమెరా లేఅవుట్​తో రావచ్చని తెలుస్తోంది. ఇక గతేడాది యాపిల్ ప్రీవియస్ మోడల్స్​లో అందించిన వెర్టికల్ కెమెరా లేఅవుట్​కు బదులుగా నిలువు కెమెరా లేఅవుట్​తో 'ఐఫోన్ 16', 'ఐఫోన్ 16 ప్లస్' మోడల్స్​​ను తీసుకొచ్చింది.

అయితే కంపెనీ ఇప్పుడు 'ఐఫోన్ 17'లో ప్రైమరీ, అల్ట్రావైడ్ కెమెరాలను రెండు వైపులా విస్తరించి ఉన్న కెమెరా బార్‌లో అడ్డంగా అమర్చనున్నట్లు ఈ కొత్త రెండర్ సూచిస్తుంది. అంతేకాక అందులో కుడి వైపున LED ఫ్లాష్‌ను కూడా మనం చూడొచ్చు. ఇక ఈ రెండర్​లో కెమెరా బార్ డార్క్​ కలర్​లో కన్పిస్తుంది. ఐఫోన్​ మాత్రం వైట్ కలర్​లో ఉంది. అంటే 'ఐఫోన్ 17' మోడల్ అన్ని కలర్ ఆప్షన్​లలో కూడా కెమెరా బార్ ఒకే రంగును కలిగి ఉండే అవకాశం ఉంది.

మరోవైపు 'ఐఫోన్ 17 ప్రో' మోడల్​పై కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ రూమర్డ్ 'ఐఫోన్ 17 ప్రో' మోడల్​ను జాన్​ ప్రాసర్ ఫ్రంట్‌పేజ్‌టెక్ యూట్యూబ్ ఛానెల్‌లోనివీడియోలో చూడొచ్చు. అందులో ఇది 'ఐఫోన్ 17' మాదిరిగానే అడ్డుగా ​సాగదీసినట్లుగా ఉన్న కెమెరా బార్​తో కనిపించినప్పటికీ ఇది చాలా సుపరిచితమైన డిజైన్​తో మూడు రియర్ కెమెరాలను కలిగి ఉంది. అయితే దీని కెమెరా బార్ 'ఐఫోన్ 17' కంటే కాస్తంత విశాలంగా ఉంది.

ప్రీవియస్ రెండర్స్​లో క్షితిజ సమాంతరంగా అమర్చిన మూడు రియర్ కెమెరాలతో 'ఐఫోన్ 17 ప్రో' మోడల్​ను చూపించిన విధంగా కాకుండా, ఫ్రంట్‌పేజ్‌టెక్ రెండర్స్​లో ఇది 'ఐఫోన్ 16 ప్రో' మాదిరిగా అదే లేఅవుట్​తో ఉండటం కన్పిస్తుంది. దీనిలో LED ఫ్లాష్ కెమెరా బార్ కుడివైపున చివరిలో ఉంటుంది. అయితే 'ఐఫోన్ 17' సిరీస్ లాంఛ్ కావడానికి ఇంకా చాలా నెలల సమయం ఉందని పాఠకులు (రీడర్స్) గమనించాలి.

ఇదిలా ఉండగా యాపిల్ ఈ ఏడాది 'ఐఫోన్ 16 ప్లస్' సక్సెసర్​ స్థానంలో 'ఎయిర్' మోడల్​ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రస్తుతం ఎటువంటి కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. దీనిపై మరిన్ని వివరాలు ప్రారంభానికి కొన్ని నెలల ముందు వెలువడే అవకాశం ఉంది.

డైనమిక్ లైట్ ఫీచర్, అతిపెద్ద బ్యాటరీ​తో వివో 5G స్మార్ట్​ఫోన్- రూ. 15,000లకే!

గగన్​యాన్​తో మరో అద్భుతానికి ఇస్రో రెడీ!- ఈ ఏడాదే మొదటి ఫ్లైట్​ లాంఛ్- షెడ్యూల్ ఇదే!

వాట్సాప్​లో భలే కొత్త ఫీచర్​- ఇకపై మీ చాట్​ను రంగులతో నింపేయొచ్చు- ఎలాగంటే?

Last Updated : Feb 16, 2025, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details