తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇదెక్కడి క్రేజ్ బాబోయ్- 'ఐఫోన్ 16' కోసం పోటెత్తిన యాపిల్ లవర్స్ - iphone 16 Series Mobiles Sale - IPHONE 16 SERIES MOBILES SALE

iphone 16 Series Mobiles Sale in India: యాపిల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 16 ఫోన్ల విక్రయాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వీటిని కొనుగోలు చేసేందుకు ఆపిల్‌ స్టోర్‌ బయట కస్టమర్లు బారులు తీరారు.

iphone 16 Series Mobiles Sale in India
iphone 16 Series Mobiles Sale in India (ANI)

By ETV Bharat Tech Team

Published : Sep 20, 2024, 10:21 AM IST

Updated : Sep 20, 2024, 10:28 AM IST

iphone 16 Series Mobiles Sale in India:అందరూ ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 16 విక్రయాలు నేటినుంచి ప్రారంభమయ్యాయి. ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు యాపిల్‌ స్టోర్‌ల ముందు క్యూ కట్టారు. ముంబయి, దిల్లీతో సహా పలు యాపిల్‌ స్టోర్‌ల బయట కొనుగోలుదారులు పెద్దఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఐఫోన్ 16 సిరీస్:ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన గ్లోటైమ్ ఈవెంట్​లో ఐఫోన్ 16 సిరీస్​ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్​లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ అనే నాలుగు మోడల్స్​ను యాపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్‌ బటన్‌, యాక్షన్‌ బటన్‌ అనే రెండు కొత్త బటన్లను జత చేసింది. వీటితోపాటు ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్‌ ఏ18తో ఈ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ వచ్చాయి.

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్స్:

  • కెపాసిటీ: 128, 256, 512 GB
  • డిస్‌ప్లే: 6.1 అంగుళాలు
  • మెయిన్‌ కెమెరా: 48 మెగా పిక్సెల్‌
  • ఫ్రంట్ కెమెరా: 12 మెగా పిక్సెల్‌
  • ఛార్జర్‌: సీటైప్‌

కలర్ ఆప్షన్స్:

  • బ్లాక్‌
  • వైట్‌
  • పింక్‌
  • టీయల్‌
  • అల్ట్రా మెరైన్‌

ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్స్:

  • కెపాసిటీ:128, 256, 512 GB
  • డిస్‌ప్లే:6.7 అంగుళాలు
  • మెయిన్‌ కెమెరా:48 మెగా పిక్సెల్‌
  • ఫ్రంట్‌ కెమెరా: 12 మెగా పిక్సెల్‌
  • ఛార్జర్‌: సీటైప్‌

కలర్ ఆప్షన్స్:

  • బ్లాక్‌
  • వైట్‌
  • పింక్‌
  • టీయల్‌
  • అల్ట్రా మెరైన్‌

ఐఫోన్ 16 ప్రొ స్పెసిఫికేషన్స్:

కెపాసిటీ: 128, 256, 512 GB, 1 TB

డిస్‌ప్లే:6.3 అంగుళాలు

మెయిన్‌ కెమెరా: 48 మెగా పిక్సెల్‌

ఫ్రంట్‌ కెమెరా: 12 మెగా పిక్సెల్‌

ఛార్జర్‌:సీటైప్‌

కలర్ ఆప్షన్స్:

  • బ్లాక్ టైటానియం
  • వైట్ టైటానియం
  • నేచురల్ టైటానియం
  • డిజర్ట్‌ టైటానియం

ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ స్పెసిఫికేషన్స్:

  • కెపాసిటీ: 128, 256, 512 GB, 1 TB
  • డిస్‌ప్లే: 6.9 అంగుళాలు
  • మెయిన్‌ కెమెరా:48 మెగా పిక్సెల్‌
  • ఫ్రంట్‌ కెమెరా: 12 మెగా పిక్సెల్‌
  • ఛార్జర్‌:సీటైప్‌

కలర్ ఆప్షన్స్:

  • బ్లాక్ టైటానియం
  • వైట్ టైటానియం
  • నేచురల్ టైటానియం
  • డిజర్ట్‌ టైటానియం

ఐఫోన్ 16 సిరీస్ ధరలు:

  • ఐఫోన్‌ 16 ధర:79,900 నుంచి ప్రారంభం
  • ఐఫోన్ 16 ప్లస్‌ ధర: 89,900 నుంచి ప్రారంభం
  • ఐఫోన్‌ 16 ప్రొ ధర:రూ.1,19,900 నుంచి ప్రారంభం
  • ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ ధర:రూ.1,44,900 నుంచి ప్రారంభం

స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్- ఏ మొబైల్​పై ఎంత ఆఫర్​ ఇస్తుందో తెలుసా? - Flipkart Offers on Mobiles

అమెజాన్ కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ రివీల్- స్మార్ట్‌ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లు ఇవే! - Amazon Announces Offers on Mobiles

Last Updated : Sep 20, 2024, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details