Apple Service Program: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్. యాపిల్ తన పాపులర్ మోడల్స్‌లో ఒకటైన 'ఐఫోన్ 14 ప్లస్' ఫోన్ బ్యాక్ కెమెరాను ఉచితంగా రిపేర్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు 'ఐఫోన్ 14 ప్లస్' బ్యాక్ కెమెరా సమస్యలను పరిష్కరించడానికి ఒక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. బ్యాక్ కెమెరాకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడుతున్న యూజర్ల ఐఫోన్‌ను ఎలాంటి కాంప్లిమెంటరీ ఛార్జీలు తీసుకోకుండానే రిపేర్ చేస్తామని తెలిపింది. అంతేకాక ఈ ప్రకటనకు ముందే రిపేర్లు చేయించుకున్నవారికి రిపేర్‌కు అయిన డబ్బులను కూడా రిఫండ్ చేస్తామని తెలిపింది
కాగా ఈ సమస్య ముఖ్యంగా ఏప్రిల్ 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య తయారైన ఐఫోన్ 14 ప్లస్ మొబైల్స్‌లో తలెత్తింది. ఈ మోడల్స్‌లో చాలా తక్కువ శాతం బ్యాక్ కెమెరాను ఉపయోగించిన సమయంలో ప్రివ్యూలను చూపించడంలో విఫలమవుతుందని యాపిల్ పేర్కొంది. ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులు యాపిల్ రిటైల్ స్టోర్, అధీకృత సర్వీస్ ప్రొవైడర్‌లు లేదా మెయిల్-ఇన్ సర్వీస్ ఆప్షన్ ద్వారా ఉచిత రిపేర్‌ను పొందొచ్చని తెలిపింది.
12 నెలల పాటు ఈ కాంప్లిమెంటరీ రిపేర్లను పొందవచ్చని వెల్లడించింది. కాగా 'ఐఫోన్ 14 ప్లస్' మోడల్‌లోని ఫోన్లలో మాత్రమే ఈ బ్యాక్ కెమెరా సమస్యలు ఉన్నాయని, వారికి మాత్రమే ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో యూజర్లు తమ 'ఐఫోన్ 14 ప్లస్' మొబైల్‌కు ఈ ఫ్రీ సర్వీస్ వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది.