Infinix AI Launched Globally: ఇటీవల గూగుల్ తన జెమిని ఏఐ, శాంసంగ్ తన గెలాక్సీ ఏఐ ప్లాట్ఫారమ్స్ను ప్రారంభించాయి. వీటి వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా యూజర్స్ ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో ఇలాంటి సమయంలో ఇన్ఫినిక్స్ కూడా తన సొంత ఏఐ ప్లాట్‌ఫారమ్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ అధునాతన టెక్నాలజీ ద్వారా యూజర్స్‌కు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇన్ఫినిక్స్ ఏఐ:ఇన్ఫినిక్స్ ఏఐలో Folex ఉంది. ఇది ఇన్ఫినిక్స్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌ను GPT-4o, జెమిని వంటి అడ్వాన్స్డ్ ఎక్స్టెర్నల్ మోడల్స్‌తో కనెక్ట్ చేసే ఒక వర్చువల్ అసిస్టెంట్. ఈ ఇంటిగ్రేషన్ వినియోగదారులకు రోబస్ట్ అండ్ వర్సిటైల్ అసిస్టెంట్‌ను అందిస్తుంది. ఇన్ఫినిక్స్ ఏఐలోని Folax.. టెక్స్ట్, వాయిస్, ఇమేజ్‌తో సహా మల్టిపుల్ ఇన్పుట్ టైప్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది ఇతర ఏఐ అసిస్టెంట్స్ల మాదిరిగానే రియల్- టైమ్ ఫీడ్‌బ్యాక్, కస్టమైజ్డ్ రికమండేషన్స్‌ను అందిస్తుంది. ఇది యూజర్స్ అవసరాలకు తగినట్లుగా వర్సిటైల్ డివైజ్‌గా పనిచేస్తుంది.
ఇన్ఫినిక్స్ఏఐ కూడా పర్సనల్, బిజినెస్ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఫీచర్స్‌ను కలిగి ఉంది. వినియోగదారులు ఫొటోలు, డాక్యుమెంట్స్ నుంచి సమాచారాన్ని పొందొచ్చు. లైవ్ టెక్స్ట్‌ను కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ ఫంక్షనాలిటీ డేటా పునరుద్ధరణను వేగవంతం చేస్తుంది. అవసరమైన సమాచారాన్ని త్వరగా యాక్సెస్ చేయాల్సిన స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, రీసెర్చ్ చేసేవారికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ ప్లాట్‌ఫారమ్ రైటింగ్ టూల్స్ రియల్ టైమ్‌లో గ్రామర్ చెక్స్, కంటెంట్ రీరైటింగ్, స్టైల్ కరెక్షన్స్ను అందించి టెక్స్ట్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. క్రియేటివ్ యూజర్స్ కోసం, మ్యాజిక్ క్రియేటివ్ ఆలోచనలకు జీవం పోయడంలో ఇవి సహాయపడతాయి.