Huawei Mate XT Ultimate Design Launched:హువావే నుంచి ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకూ గ్లోబల్‌గా లాంఛ్ అయింది. 'హువావే మేట్ XT అల్టిమేట్ డిజైన్' పేరుతో కంపెనీ దీన్ని గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను 2024లోనే తన దేశీయ మార్కెట్లో అంటే చైనాలో కంపెనీ లాంఛ్ చేసింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లలోకి దీన్ని తీసుకొచ్చింది.
'హువావే మేట్ XT అల్టిమేట్ డిజైన్' గ్లోబల్ వెర్షన్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:
డిస్ప్లే: ఈ ఫోన్‌ను పూర్తిగా విప్పినప్పుడు 10.2-అంగుళాల ఫ్లెక్సిబుల్ LTPO OLED డిస్ప్లేను కలిగి ఉంది. దీన్ని ఒకసారి మడతపెట్టినప్పుడు 7.9-అంగుళాల LTPO OLED డిస్ప్లే ఫోల్డబుల్ పరికరాన్ని కలిగి ఉంది. ఇది రెండుసార్లు మడతపెట్టినప్పుడు 6.4-అంగుళాల LTPO OLED డిస్ప్లేకు తగ్గిస్తుంది. ఇక ఈ ఫోన్ స్క్రీన్ 90 Hz వరకు అడాప్టివ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 240 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 1440 Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, 382 PPI పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది.
వేరియంట్స్:కంపెనీ ఈ ఫోన్ గ్లోబల్ వెర్షన్‌ను కేవలం ఒకే 16GB RAM + 1TB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో తీసుకొచ్చింది.
చిప్‌సెట్ అండ్ స్టోరేజ్: చైనాలోని మేట్ XT అల్టిమేట్ డిజైన్‌లో కంపెనీ ఇన్-హౌస్ కిరిన్ 9010 చిప్‌సెట్‌ను అందించింది. అయితే ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ గ్లోబల్ వెర్షన్ చిప్‌సెట్ వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ UAE సైట్ ఈ ఫోన్ 16GB RAM అండ్ 1TB స్టోరేజ్‌తో జతయి "మోడ్రన్ ప్రాసెసర్"ను కలిగి ఉన్నట్లు మెన్షన్ చేసింది.
కెమెరా: 'మేట్ XT అల్టిమేట్ డిజైన్' ట్రై ఫోల్డ్ఫోన్ వెనక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OIS అండ్ f/1.2 అండ్ f/4.0 మధ్య వేరియబుల్ ఎపర్చరుతో 50MP మెయిన్ సెన్సార్‌ను కలిగి ఉంది. అంతేకాక ఈ ఫోన్లో f/2.2 ఎపర్చరుతో 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో పాటు 5.5x ఆప్టికల్ జూమ్, OIS, f/3.4 ఎపర్చరు సపోర్ట్‌తో 12MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. ఇక దీని ఫ్రంట్ కెమెరా f/2.2 ఎపర్చరుతో 8MP సెన్సార్‌ను కలిగి ఉంది.
బ్యాటరీ:ఇది 66W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీని కలిగి ఉంది.