తెలంగాణ

telangana

ETV Bharat / technology

వాట్సాప్​లో భలే కొత్త ఫీచర్​- ఇకపై మీ చాట్​ను రంగులతో నింపేయొచ్చు- ఎలాగంటే? - WHATSAPP INTRODUCE CHAT THEMES

వాట్సాప్​లో చాట్​ థీమ్స్ ఫీచర్- దీన్ని ఉపయోగించడం ఎలా?

Whatsapp Introduce Chat Themes Feature
Whatsapp Introduce Chat Themes Feature (Photo Credit- WHATSAPP BLOG)

By ETV Bharat Tech Team

Published : Feb 14, 2025, 7:36 PM IST

Whatsapp Introduce Chat Themes:ప్రముఖ ఇన్​స్టంట్ మెసెజింగ్ యాప్ వాట్సాప్​ ఎప్పటికప్పుడు తన యూజర్ల కోసం కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్​ను తీసుకొస్తోంది. దీని సాయంతో యూజర్లు ఇకపై నచ్చిన విధంగా చాట్​ థీమ్​, చాట్ బబుల్​ని మార్చుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్‌ సాయంతో వినియోగదారులు తమ వాట్సాప్​లో అనేక రకాల థీమ్‌లను తమ చాట్‌కు జోడించొచ్చు. ఇందులో 30 రకాల వాల్‌పేపర్‌ ఆప్షన్లు ఉన్నాయి. కావాలంటే మీ కెమెరాతో తీసిన ఫొటోలనూ చాట్‌ థీమ్‌గా పెట్టుకోవచ్చు. అంతే కాదండోయ్‌ చాట్‌ బబుల్‌ని కూడా రంగుల్లో మార్చుకోవచ్చు.

సాధారణంగా వాట్సాప్‌లో మనం పెట్టే మెసేజ్‌లు గ్రీన్ కలర్​లో, మనకు వచ్చే మెసేజ్‌లు తెలుపు రంగులో కన్పిస్తాయి. ఈ కొత్త ఫీచర్​ సాయంతో ఇకపై వీటిని కూడా మార్చుకోవచ్చు. అంటే ఇకనుంచి వాట్సప్‌ని మీకు నచ్చిన రంగులతో నింపొచ్చన్నమాట. యూజర్ల అనుభవాన్ని మెరుగపరిచి, చాటింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది.

దీని సాయంతో మీకు నచ్చితే అన్ని చాట్‌లకు ఒకే థీమ్‌ పెట్టుకోవచ్చు. లేదంటే కేవలం మీకు నచ్చిన వ్యక్తుల చాట్‌లకు మాత్రమే థీమ్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఈ కొత్త థీమ్‌ మీకు మాత్రమే కన్పిస్తుందనే విషయం గుర్తుంచుకోండి. వాట్సాప్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నవారు కూడా ఈ ఫీచర్‌ని వినియోగించుకోవచ్చు.

వాట్సాప్​లో చాట్​ థీమ్స్​ను ఎలా మార్చాలి?:

1. వాట్సాప్​లో అన్ని చాట్‌లకు థీమ్స్ మార్చడం:

  • ఇందుకోసం యూజర్లు వాట్సాప్​లోని Settingsలోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత Chatsపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు Default chat themeని సెలెక్ట్ చేసుకోవాలి.

2. నచ్చిన వ్యక్తులకు మాత్రమే:మీ వాట్సాప్​లో కేవలం కొంతమంది వ్యక్తుల చాట్​ థీమ్​ను మాత్రమే మార్చుకోవాలంటే ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • మీది ఐఓఎస్ డివైజ్ అయితే వాట్సాప్​ ఓపెన్ చేస్తే అందులో పైన స్క్రీన్​లో చాట్ నేమ్ ఆప్షన్ కన్పిస్తుంది. దీని ద్వారా మీరు యాపిల్ డివైజెస్​లో వాట్సాప్ చాట్ థీమ్స్​ను మార్చుకోవచ్చు.
  • ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఇందుకోసం వారి వాట్సాప్‌లో కనిపించే 3-చుక్కల మెనూపై క్లిక్ చేసి, చాట్ థీమ్ అనే కొత్త ఆప్షన్​పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఈ విధంగా మీరు యాపిల్, ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ వాట్సాప్ చాట్‌ థీమ్స్​ను మార్చుకోవచ్చు. ఇప్పటికే వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూ చాట్ థీమ్స్, కొత్త వాల్‌పేపర్‌లను విడుదల చేయడం ప్రారంభించింది. ఒకవేళ మీ ఫోన్​లో వాట్సాప్ ఈ కొత్త చాట్ థీమ్ఫీచర్ రాకపోతే మీరు కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకుని ఈ కొత్త ఫీచర్‌ ట్రై చేయొచ్చు.

మహింద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్స్ స్టార్ట్- ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు వివరాలివే!

ఐఫోన్ SE 4 లాంఛ్ డేట్ రివీల్!- టిమ్​కుక్ వదిలిన టీజర్ చూశారా?

OTT లవర్స్​కు గుడ్​న్యూస్- జియోహాట్‌స్టార్‌ వచ్చేసిందోచ్- సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ ఇవే!

ABOUT THE AUTHOR

...view details