తెలంగాణ

telangana

ETV Bharat / technology

అమ్మాయిలూ 'స్పై కెమెరా'లను ఎలా కనిపెట్టాలో తెలుసా? - How To Detect Spy Cameras

How To Detect Spy Cameras Around Us : ఇటీవలి కాలంలో అమ్మాయిలను స్పై కెమెరాలతో షూట్ చేస్తున్న ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనితో చాలా మంది మహిళలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. అందుకే ఇలాంటి వాటి బారిన పడకుండా, స్పై కెమెరాలను ఎలా సులువుగా గుర్తించాలో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Spy Cameras
Spy Cameras (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 1:43 PM IST

How To Detect Spy Cameras Around Us :ప్రస్తుత రోజుల్లో సీసీటీవీ కెమెరాల వినియోగం ఎక్కువైపోయింది. షాపింగ్​ మాల్స్​, హోటళ్లు, విద్యాసంస్థలు, కార్యాలయాలు సహా మనం ఉండే ఇంటి బయట, చుట్టూ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవన్నీ భద్రతాపరంగా మనకు రక్షణ కల్పిస్తాయన్నది వాస్తవం. ఇదిలా ఉంటే కొంత మంది నేరగాళ్లు స్పై కెమెరాలు ఏర్పాటుచేసి, ఇతరులకు తెలియకుండా వీడియోలు తీస్తుంటారు. తరువాత వారిని బెదిరించి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. సైబర్​ నేరగాళ్లు అయితే నేరుగా మీ ఫోన్​, ల్యాప్​టైప్​, ట్యాబ్​ లాంటి డివైజ్​లను హ్యాక్ చేసి, మీ కెమెరాలతోనే మిమ్మల్ని ట్రాక్ చేస్తుంటారు. ఇలా మీకు తెలియకుండానే మీ ఫొటోలను, వీడియోలను రికార్డ్ చేస్తుంటారు. వీటి వల్ల మీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుంది. పైగా ఆర్థికంగా, మానసికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఎవరైనా మీపై నిఘా వేసినట్లు అనుమానం వచ్చినా, స్పై కెమెరాలు ఉన్నట్లు అనిపించినా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కెమెరా రికార్డింగ్​ను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఆథరైజ్డ్​ రికార్డింగ్ కాగా, మరొకటి అన్​ఆథరైజ్డ్ రికార్డింగ్​​. ఉదాహరణకు ఆఫీసుల్లో, షాపింగ్​ కాంప్లెక్సుల్లో, ఆపార్ట్​మెంట్​లలో ఏర్పాటు చేసే కెమెరాల్లో రికార్డ్​ అయ్యే వాటిని ఆథరైజ్డ్​ రికార్డింగ్​గా పేర్కొంటారు. అలాకాకుండా, ఎవరికీ తెలియకుండా మీ కంటికి కనిపించని విధంగా స్పై కెమెరాలు అమర్చడం లేదా మీ ఫోన్​, పీసీలను హ్యాక్ చేసి, మీ ఫొటోలను, వీడియోలను రికార్డ్ చేస్తే, దానిని అన్​-ఆథరైజ్డ్​ రికార్డింగ్​గా చెప్పవచ్చు.

మీ ఫోన్​తో స్పై కెమెరాలను కనిపెట్టేయవచ్చు!

  • మీ గదిలో, బాత్​ రూమ్​లో పెట్టిన సీక్రెట్ కెమెరాలను మొబైల్ ఫోన్ కెమెరాతో సులువుగా గుర్తించవచ్చు. సీక్రెట్​ కెమెరాలు చీకట్లో కూడా పనిచేసేందుకు వీలుగా, వాటికి ఇన్‌ఫ్రారెడ్, LEDs ఉంటాయి. ఆ కెమెరాలను కనిపెట్టేందుకు ముందుగా గదిలో లైట్లన్నీ ఆఫ్ చేసేయండి. కర్టెన్లను మూసేసి, గదిని వీలైనంత చీకటిగా మార్చండి. తర్వాత మొబైల్ కెమెరా ఆన్ చేసి, గది మొత్తాన్ని స్కాన్ చేయండి. మొబైల్ కెమెరా దేనినైనా ఫోకస్ చేసిందంటే, అక్కడ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఉన్నట్లే లెక్క.
  • మీరు నేరుగా మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వేసి కూడా సీక్రెట్ కెమెరాలను గుర్తించవచ్చు. ఇందుకోసం మీరు గదిలోకి వెళ్లి ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి. గదిలోని అద్దాలు, స్మోక్ డిటెక్టర్, వాల్ పెయింట్, పూల బొకే వంటి వాటిని లోతుగా, జాగ్రత్తగా గమనించాలి. ఫ్లాష్ లైట్ కాంతి, స్పై కెమెరా లెన్స్‌పై పడితే చాలు, వెంటనే ఆ కెమెరా మీకు కనిపిస్తుంది.
  • గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్‌లు చాలానే ఉంటాయి. ఉన్నాయి. ఇవి రహస్య కెమెరాలను స్కాన్ చేసి ఈజీగా వాటిని కనిపెట్టేస్తాయి. కనుక ఈ యాప్​లను డౌన్‌లోడ్ చేసుకొని, ఓపెన్ చేస్తే, ఆటోమేటిక్‌గా అది ఫోన్ కెమెరాని ఉపయోగించుకొని, రహస్య కెమెరాలు ఎక్కడ ఉన్నాయో ఈజీగా కనిపెట్టేస్తాయి.
  • స్పై కెమెరాలు వైఫె నెట్‌వర్క్‌తో పనిచేస్తూ ఉంటాయి. ఇవి రికార్డ్ చేసిన వీడియోని వైఫై ద్వారా ట్రాన్స్‌మిట్ చేస్తూ ఉంటాయి. అందువల్ల మీరు గదిలోకి వెళ్లాక, అక్కడ వైఫై నెట్‌వర్క్స్ ఏమైనా ఉన్నాయో,లేదో చూడండి. ఇందుకోసం మీరు WiFiman, NetSpot లాంటి నెట్‌వర్క్ స్కానర్ యాప్స్ కూడా ఉపయోగించవచ్చు. వాటి ద్వారా మీకు ఏదైనా అనుమానాస్పదమైన నెట్‌వర్క్ కనిపిస్తే, దానిపై హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయండి. వాళ్ల స్పందించకపోతే పోలీసులకు రిపోర్ట్ చేయండి.
  • హోటల్ గదుల్లో స్మోక్ డిటెక్టర్లు, గోడ గడియారాలు, పవర్ అవుట్‌లెట్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, లైట్ బల్బులు వంటి వాటిలో స్పై కెమెరాలను ఇన్​స్టాల్​ చేసే ఛాన్స్ ఉంటుంది. కనుక మీకు అనుమానాస్పద పరికరాలు లేదా రహస్య కెమెరాలు ఉన్నట్లు కనిపిస్తే పోలీసులకు కాల్ చేసి, కంప్లైట్ ఇవ్వండి.

మీకు తెలియకుండా మీ ఇంట్లోనే స్పై కెమెరాలను అమరిస్తే?

  • మీరు ఉన్న చోట ఏదైనా అన్​ఆథరైజ్డ్​ రికార్డింగ్​ జరుగుతుంటే, మీ పీసీ లేదా ల్యాప్​టాప్​ కెమెరా కాస్త వింతగా ప్రవర్తిస్తుంది. అంటే మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారని అర్థం.
  • పీసీ, ఫోన్​ల్లోని లైట్లు మీ ప్రమేయం లేకుండా ఆన్, ఆఫ్​ అవుతుంటే,​ మీపై ఎవరో నిఘా వేస్తున్నారని అర్థం.
  • ఉన్నట్టుండి మీ డివైజ్​ సెట్టింగ్స్​లో ఏమైనా మార్పులు గుర్తిస్తే, కూడా మీరు అన్​ఆథరైజ్డ్​ నిఘాలో ఉన్నారని గుర్తించుకోవాలి.
  • మీరు వాడే ల్యాప్​టాప్​ లేదా పీసీలో తరచుగా పాప్​-అప్​ విండోలు ఓపెన్ అవుతుంటే, మీరు అనధికార నిఘా నీడలో ఉన్నారని అర్థం చేసుకోవాలి.
  • మీ పీసీ హోమ్​ పేజీలో మీకు తెలియకుండానే మార్పులు జరిగితే స్పైయింగ్ జరుగుతుందని అనుమానించండి.
  • మీ డివైజ్​ హ్యాంగ్​ అయినా, మీకు తెలియని ప్రోగ్రామ్​లు మీ సిస్టమ్​ స్టార్టప్​​లో లాంఛ్​ అయినా ఎవరో మిమ్మల్ని పరిశీలిస్తున్నారని గుర్తించండి.

అనధికార నిఘా రికార్డింగ్​లను ఇలా అరికట్టవచ్చు!

  • కొన్ని రకాల వెబ్​సైట్​ల ద్వారా కూడా మనల్ని స్పై చేస్తుంటారు. అందుకే అలాంటి సైట్లను ఓపెన్ చేయకూడదు.
  • మీరు స్పై కెమెరా లేదా మైక్రోఫోన్​లను గుర్తిస్తే, వెంటనే వాటిని భౌతికంగా ధ్వంసం చేయండి. లేదా అక్కడి నుంచి తొలగించండి.
  • మీ ఫోన్​, ల్యాప్​టాప్​ లేదా పీసీ కెమెరాలను ఏదైనా స్టికర్​తో క్లోజ్​ చేయండి.

స్పై కెమెరాల నుంచి రక్షణ పొందాలంటే?

  • మీరు ల్యాప్​టాప్​/ పీసీ, ఫోన్​లు వినియోగిస్తున్నట్లయితే స్ట్రాంగ్​ పాస్​వర్డ్​లను క్రియేట్​ చేసుకోవాలి.
  • సంక్లిష్టమైన 12 డిజిట్స్​ పాస్​వర్డ్​ను సెట్​ చేసుకోవడం మంచిది. ఇందులో​ క్యారెక్టర్లు, నంబర్లు, స్పెషల్​ క్యారెక్టర్స్​ ఇలా అన్నీ ఉండేలా సెట్ చేసుకోవాలి.
  • సాధ్యమైతే టూ ఫ్యాక్టర్​ అథంటికేషన్​ను ఎనేబుల్ చేసుకోవాలి.
  • సాఫ్ట్​వేర్​, హార్డ్​వేర్​ పరికరాలను ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేసుకోవాలి.
  • అవసరమైతే తప్ప వెబ్‌క్యామ్‌లు, స్మార్ట్‌టీవీలు లేదా ప్రింటర్లు లాంటి ఐఓటీ పరికరాలకు ఇంటర్నెట్​ను కనెక్ట్ చేయవద్దు.

తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడాల్సి వస్తే,

  • ఐఓటీ డివైజ్​లకు వీపీఎన్​ కనెక్షన్​ను ఇవ్వండి.
  • IP అడ్రస్​ ఫిల్టర్​ను వినియోగించి ఇంటర్నెట్​ యాక్సెస్​కు పరిమితులు విధించండి.
  • ఎంపిక చేసిన ఐపీ చిరునామాలను మాత్రమే ఇంటర్నెట్​ యాక్సెస్​ ఉండేలా సెట్టింగ్స్​ మార్చుకోండి.
  • లేదంటే Geo-IP ఫిల్టర్​ను వాడండి.

చివరగా మీరు ఏం చేయాలంటే

  • మీ డివైజ్​కు ఇంటర్నెట్​ యాక్సెస్​ను వెంటనే నిలిపివేయాలి.
  • ఏదైనా సంస్థ లేదా వ్యక్తి మీపై అనధికారంగా నిఘా వేస్తే, పోలీసులకు రిపోర్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details