తెలంగాణ

telangana

ETV Bharat / technology

స్పై కెమెరాలు ఉన్నాయని అనుమానంగా ఉందా? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండిలా! - Spy Camera Detection

How To Detect Spy Cameras Around Us : మీకు తెలియకుండానే స్పై కెమెరాలు మీ కదలికలను రికార్డ్​ చేస్తున్నాయని అనుమానంగా ఉందా? అయితే అలాంటి వాటిని ఎలా గుర్తించాలి? వాటి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

How To Detect Spy Cameras Around Us
How To Detect Hidden Camera

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 1:41 PM IST

How To Detect Spy Cameras Around Us :ప్రస్తుత రోజుల్లో సీసీటీవీ కెమెరాల వినియోగం ఎక్కువైపోయింది. షాపింగ్​ మాల్స్​, హోటళ్లు, విద్యాసంస్థలు, కార్యాలయాలు సహా మనం ఉండే ఇంటి బయట, చుట్టూ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే ఇవన్నీ భద్రతపరంగా మనకు రక్షణ కల్పిస్తాయన్నది వాస్తవం. ఇదిలా ఉంటే కొంతమందినేరగాళ్లు స్పై కెమెరాలు ఉంచి, ఇతరులకు తెలియకుండా వీడియోలు తీస్తుంటారు. తరువాత వారిని బెదిరించి ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులకు గురి చేస్తుంటారు. సైబర్​ నేరగాళ్లు అయితే నేరుగా మా ఫోన్​, ల్యాప్​టైప్​, ట్యాబ్​ల లాంటి డివైజ్​లను హ్యాక్ చేసి, మన కెమెరాలతోనే మనల్ని ట్రాక్ చేస్తుంటారు. ఇలా మనకి తెలియకుండానే మన ఫొటోలను, వీడియోలను రికార్డ్ చేస్తుంటారు. వీటి వల్ల మన వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుంది. పైగా ఆర్థికంగా, మానసికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎవరైనా మీపై నిఘా వేసినట్లు అనుమానం వచ్చినా, స్పై కెమెరాలు ఉన్నట్లు అనిపించినా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.


సాధారణంగా కెమెరా రికార్డింగ్​ లేదా యాక్సెస్​లను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఆథరైజ్డ్​ రికార్డింగ్ కాగా, మరొకటి అన్​ఆథరైజ్డ్ రికార్డింగ్​​. ఉదాహరణకు ఆఫీసుల్లో, షాపింగ్​ కాంప్లెక్సుల్లో, ఆపార్ట్​మెంట్​లలో ఏర్పాటు చేసే కెమెరాల్లో రికార్డ్​ అయ్యే వాటిని ఆథరైజ్డ్​ రికార్డింగ్​గా పేర్కొంటారు. అలాకాకుండా, మనకి తెలియకుండా మన చూట్టూ కంటికి కనిపించని విధంగా ఉండే స్పై కెమెరాలు అమర్చడం లేదా మన ఫోన్​, పీసీలను హ్యాక్ చేసి, మన ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేయడాన్ని అన్​-ఆథరైజ్డ్​ రికార్డింగ్​గా చెప్పవచ్చు.

స్పై కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

  • మీరు ఉన్న చోట ఏదైనా అన్​ఆథరైజ్డ్​ రికార్డింగ్​ జరుగుతుంటే, మీ పీసీ లేదా ల్యాప్​టాప్​ కెమెరా కాస్త వింతగా ప్రవర్తిస్తుంది. అంటే మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారని అర్థం.
  • పీసీ, ఫోన్​ల్లోని లైట్లు మీ ప్రమేయం లేకుండా ఆన్, ఆఫ్​ అవుతుంటే,​ మీపై ఎవరై నిఘా వేస్తున్నారని అర్థం.
  • ఉన్నట్టుండి మీ డివైజ్​ సెట్టింగ్స్​లో ఏమైనా మార్పులు గుర్తిస్తే, కూడా మీరు అన్​ఆథరైజ్డ్​ నిఘాలో ఉన్నారని గుర్తించండి.
  • మీరు వాడే ల్యాప్​టాప్​ లేదా పీసీలో తరచుగా పాప్​-అప్​ విండోలు ఓపెన్ అవుతుంటే, మీరు అనధికార నిఘా నీడలో ఉన్నారని అర్థం చేసుకోండి.
  • మీ పీసీ హోమ్​ పేజీలో మీకు తెలియకుండానే మార్పులు జరిగితే స్పైయింగ్ జరుగుతుందని అనుమానించండి.
  • డివైజ్​ హ్యాంగ్​ అయినా, మీకు తెలియని ప్రోగ్రామ్​లు మీ సిస్టమ్​ స్టార్టప్​​లో లాంఛ్​ అయినా ఎవరో మిమ్మల్ని స్పై చేస్తున్నట్లు గుర్తించండి.

అనధికార నిఘా రికార్డింగ్​లను ఇలా అరికట్టవచ్చు

  • కొన్ని రకాల వెబ్​సైట్​ల ద్వారా కూడా మనల్ని స్పై చేస్తుంటారు. అందుకే అలాంటి సైట్లను ఓపెన్ చేయకూడదు.
  • మీరు స్పై కెమెరా లేదా మైక్రోఫోన్​లను గుర్తిస్తే, వెంటనే వాటిని భౌతికంగా ధ్వంసం చేయండి. లేదా అక్కడి నుంచి తొలగించండి.
  • మీ ల్యాప్​టాప్​ లేదా పీసీ కెమెరాలను ఏదైనా స్టికర్​తో క్లోజ్​ చేయండి.

స్పై కెమెరాల నుంచి రక్షణ పొందాలంటే?

  • మీరు ల్యాప్​టాప్​/ పీసీ, ఫోన్​లు వినియోగిస్తున్నట్లయితే స్ట్రాంగ్​ పాస్​వర్డ్​లను క్రియేట్​ చేసుకోవాలి.
  • సంక్లిష్టమైన 12 డిజిట్స్​ పాస్​వర్డ్​ను సెట్​ చేసుకోవడం మంచిది. ఇందులో​ క్యారెక్టర్లు, నంబర్లు, స్పెషల్​ క్యారెక్టర్స్​ ఇలా అన్నీ ఉండేలా సెట్ చేసుకోవాలి.
  • సాధ్యమైతే టూ ఫ్యాక్టర్​ అథంటికేషన్​ను ఎనేబుల్ చేసుకోవాలి.
  • సాఫ్ట్​వేర్​, హార్డ్​వేర్​ పరికరాలను ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేసుకోవాలి.
  • అవసరమైతే తప్ప వెబ్‌క్యామ్‌లు, స్మార్ట్‌టీవీలు లేదా ప్రింటర్లు లాంటి ఐఓటీ పరికరాలకు ఇంటర్నెట్​ను కనెక్ట్ చేయవద్దు.

తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడాల్సి వస్తే,

  • ఐఓటీ డివైజ్​లకు వీపీఎన్​ కనెక్షన్​ను ఇవ్వండి.
  • IP అడ్రస్​ ఫిల్టర్​ను వినియోగించి ఇంటర్నెట్​ యాక్సెస్​కు పరిమితులు విధించండి.
  • ఎంపిక చేసిన ఐపీ చిరునామాలను మాత్రమే ఇంటర్నెట్​ యాక్సెస్​ ఉండేలా సెట్టింగ్స్​ మార్చుకోండి.
  • లేదంటే Geo-IP ఫిల్టర్​ను వాడండి.

చివరగా మీరు ఏం చేయాలంటే

  • మీ డివైజ్​కు ఇంటర్నెట్​ యాక్సెస్​ను వెంటనే నిలిపివేయాలి.
  • ఏదైనా సంస్థ లేదా వ్యక్తి మీపై అనధికారంగా నిఘా వేస్తే, పోలీసులకు రిపోర్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

VPN ఆన్​- ఇంటర్నెట్ బంద్​- కారణమేంటి?

స్పామ్​ కాల్స్​/ మెసేజ్​లు వస్తున్నాయా? 'చక్షు' పోర్టల్​లో ఫిర్యాదు చేయండిలా!

ABOUT THE AUTHOR

...view details