How To Connect Two Pairs Of AirPods To One Phone :మీరు యాపిల్ ప్రొడక్టులు ఉపయోగిస్తుంటారా? అంటే ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ బుక్, యాపిల్ టీవీ వాడుతుంటారా? అయితే మీకొక ప్రశ్న. మీరు ఎప్పుడైనా ఒకేసారి రెండు జతల ఎయిర్‌పాడ్స్‌ను మీ యాపిల్ డివైజ్‌కు కనెక్ట్ చేశారా? మీ సమాధానం 'లేదు' అయితే ఇది మీ కోసమే. యాపిల్ డివైజ్‌ల్లో షేర్ ఆడియో అనే ఫీచర్ ఉంటుంది. దీనిని ఉపయోగించుకుని ఒకేసారి రెండు జతల ఎయిర్‌పాడ్స్‌ను మీ ఐఫోన్/ ఐపాడ్/ మ్యాక్‌బుక్/ యాపిల్ టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Connect Two Pairs Of AirPods To One iOS Device :యాపిల్ షేర్ ఆడియో ఫీచర్ సహాయంతో రెండు జతల ఎయిర్ పాడ్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ పాడ్స్, ఎయిర్ పాడ్స్ ప్రో, ఎయిర్ పాడ్స్ మ్యాక్స్, బీట్స్ హెడ్ఫోన్స్లను పలు జనరేషన్స్‌కు చెందిన ఐఫోన్స్, ఐపాడ్లకు కనెక్ట్ చేయవచ్చు.
- ముందుగా మీరు ఒక జత ఎయిర్‌పాడ్స్‌ను మీ ఐఫోన్/ ఐపాడ్‌కు కనెక్ట్ చేసుకోవాలి.
- తరువాత మీ ఐఫోన్/ ఐపాడ్‌లోని కంట్రోల్ సెంటర్‌ను ఓపెన్ చేయాలి.
- అక్కడ ఉన్న AirPlay ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ ఐఫోన్/ఐపాడ్‌కు కనెక్ట్ చేసి ఉన్న అన్ని డివైజ్‌ల లిస్ట్ కనిపిస్తుంది.
- ఇప్పుడు మీరు కనెక్ట్ చేయాలని అనుకుంటున్న రెండో జత ఎయిర్‌పాడ్స్‌ను తీసుకోండి.
- ఈ ఎయిర్‌పాడ్స్ ఉన్న కేస్ లిడ్ తీసేసి మీ ఐఫోన్/ ఐపాడ్‌కు దగ్గరగా పెట్టండి.
- అవి కనెక్టెడ్ డివైజ్ లిస్ట్‌లో కనబడగానే, షేర్ ఆడియోను మళ్లీ సెలక్ట్ చేసుకుని రెండో జత ఎయిర్‌పాడ్స్‌ను ఎంచుకోండి.
- అంతే సింపుల్! రెండూ యాక్టివేట్ అయిపోతాయి.
Controlling the volume in two pairs of AirPods :సెకండ్ ఎయిర్‌పాడ్స్ ఆడియో క్వాలిటీ మొదటిదాని కంటే మెరుగ్గా ఉండకపోవచ్చు. అంతేకాదు రెండు జతల ఎయిర్‌పాడ్స్‌ను ఒకేసారి కనెక్ట్ చేసుకుంటే, వాటిలోని స్పేషియల్ ఆడియో హెడ్ ట్రాకింగ్ ఫీచర్ ఆగిపోతుంది. అయితే వాటి వాల్యూమ్, ప్లేబ్యాక్‌లను మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్లోనే ప్లేబ్యాక్ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.
ఆడియో షేరింగ్‌కు సపోర్ట్ చేసే హెడ్‌ఫోన్స్ ఇవే!
- ఎయిర్‌పాడ్స్ (ఫస్ట్ జెన్)
- ఎయిర్‌పాడ్స్ మాక్స్
- ఎయిర్‌పాడ్స్ ప్రో (ఫస్ట్ జెన్)
- బీట్స్ ఫిట్ ప్రో
- ఫ్లెక్స్ ఫ్లెక్స్
- బీట్స్ సోలో3 వైర్‌లెస్
- బీట్స్ సోలో 4
- బీట్స్ స్టూడియో3 వైర్‌లెస్
- బీట్స్ ఎక్స్
- పవర్‌బీట్స్
- పవర్‌బీట్స్ ప్రో
- పవర్‌బీట్స్ 3 వైర్‌లెస్
- సోలో ప్రో