తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ ​ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానంగా ఉందా? ఈ 'సీక్రెట్​ కోడ్స్​'​తో డివైజ్​ను ప్రొటెక్ట్​​ చేసుకోండిలా! - How To Check Phone Is Hacked Or Not - HOW TO CHECK PHONE IS HACKED OR NOT

How To Check My Phone Is Hacked Or Not : మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానంగా ఉందా? డోంట్ వర్రీ! ఇక్కడ ఇచ్చిన సీక్రెట్​ కోడ్స్ ఉపయోగించి మీ ఫోన్​ హ్యాక్ అయిందో, లేదో ఈజీగా తెలుసుకోండి.

How to Know If Your Phone is Hacked
How To Check My Phone Is Hacked Or Not

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 4:46 PM IST

How To Check My Phone Is Hacked Or Not : మనిషి జీవితంలో స్మార్ట్​ఫోన్ ఒక భాగమైపోయింది. స్మార్ట్​ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. కిరాణా సామానుల నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపు వరకు ప్రతీదీ స్మార్ట్​ఫోన్​తోనే జరిగిపోతోంది. టెక్నాలజీ పెరిగినా కొద్దీ కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తునే ఉన్నాయి. అందుకే స్మార్ట్​ఫోన్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు దాడులు చేయడం ప్రారంభించారు.

నేడు ప్రతి ఒక్కరూ స్మార్ట్​ఫోన్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. ఇందుకోసం ఫోన్​లో బ్యాంకు వివరాలన్నింటినీ సేవ్ చేసుకుంటారు. అంతేకాదు ఫోన్లలో పర్సనల్ ఫొటోలు, వీడియోలను కూడా స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇవి కనుక హ్యాకర్ల చేతికి చిక్కితే, ఆర్థికంగా, మానసికంగా చితికిపోవడం ఖాయం. అందుకే ఫోన్ వాడే ప్రతిఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం ఫోన్ బిహేవియర్​ను కూడా మానిటర్ చేస్తూ ఉండాలి.

USSD కోడ్స్ ఉయోగించడం:
మీ ఫోన్​ను USSD కోడ్స్ ఉపయోగించి మానిటర్ చేయవచ్చు. స్టార్​ (*) లేదా యాష్​ (#)తో ప్రారంభమై, యాష్​(#)తో ఎండ్ అయ్యే ప్రత్యేకమైన కోడ్స్ ఇవి. మొబైల్ నెట్​వర్క్ ఆపరేటర్​తో కమ్యూనికేట్ చేసేందుకు; ఫోన్​లోని పలు ఫీచర్లను, సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించి మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? లేదా? చెక్​ చేయవచ్చు. ముఖ్యంగా మీ ఫోన్ స్టేటస్, పెర్ఫామెన్స్ చెక్ చేసుకుని, సైబర్​ మోసాలకు చెక్ పెట్టవచ్చు.

ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ తెలుసుకోవల్సిన 7 సీక్రెడ్​ కోడ్స్ :
నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB) ప్రకారం, ఈ సీక్రెట్​ కోడ్స్​ను భారతదేశంలోని ప్రతి ఫోన్ వినియోగదారుడు కచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

*#21#
ఈ కోడ్ ఉపయోగించి మీ కాల్ లేదా ఫోన్ నంబర్ ఇతరులకు ఫార్వార్డ్ అయ్యిందో? లేదో? తెలుసుకోవచ్చు. దీనితో కాల్ ఫార్వర్డ్ స్కామ్స్​కు చెక్ పెట్టేందుకు వీలవుతుంది.

#0#
ఫోన్ హ్యాక్ అయితే దాని కమెరాలు, సెన్సార్లు వింతగా ప్రవరిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో యూజర్లు #0# కోడ్ ఉపయోగించి ఫోన్ డిస్‌ప్లే, స్పీకర్, కెమెరా, సెన్సార్​లు సరిగ్గా పని చేస్తున్నాయో? లేదో? చెక్ చేసుకోవాలి.

*#07#
ఈ USSD కోడ్​మీ ఫోన్ SAR వాల్యూని తెలుపుతుంది. అంటే ఈ కోడ్ ఉపయోగించి, మీ డివైస్ నుంచి ఎంత మేరకు రేడియేషన్ వెలువడుతుందో సులువుగా తెలుసుకోవచ్చు.

*#06#
ఈ USSD కోడ్ మీ ఫోన్ IMEI నంబర్‌ని తెలియజేస్తుంది. ఒకవేళ మీ స్మార్ట్​ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగలించబడినా, ఈ IMEI నంబర్ ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

##4636##
ఈ కోడ్ మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ, ఇంటర్నెట్, వై-ఫైకి సంబంధించిన గ్రాన్యులర్ వివరాలను అందిస్తుంది. దీని ద్వారా ఇతరులు అనధికారికంగా మీ ఫోన్​ను కంట్రోల్ చేస్తున్నారో? లేదో? తెలుసుకోవచ్చు.

##34971539##
ఈ కోడ్‌ని ఉపయోగించి మీ ఫోన్‌లోని కెమెరా సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు.

2767*3855#
ఇది చాాలా రిస్కీ కోడ్​. దీనిని ఉపయోగించాలంటే ముందుగా మీ డేటా అంతటినీ బ్యాకప్ చేసుకోవాలి. ఈ యూఎస్​ఎస్​డీ కోడ్ ఉపయోగిస్తే, మీ ఫోన్ రీసెట్​ అయిపోతుంది. అంటే మీ ఫోన్​లోని డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. మీ ఫోన్​లో ప్రమాదకరమైన మాల్వేర్స్, వైరస్​లు ఉంటే వాటిని పూర్తిగా తొలగించడానికి ఈ సీక్రెడ్ కోడ్ ఉపయోగించాలి.

యూట్యూబ్​ నయా ఏఐ ఫీచర్స్​ - ఇకపై​ బోరింగ్ వీడియోలకు గుడ్​ బై! - YouTube AI Features

డేటా బ్యాకప్​తో ఎన్నో లాభాలు- ఎప్పుడైనా ఎక్కడైనా ఈజీగా యాక్సెస్​- చోరీ అయినా సేఫే! - World Backup Day 2024

ABOUT THE AUTHOR

...view details