తెలంగాణ

telangana

ETV Bharat / technology

యూట్యూబర్స్​​ ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? వింటే షాక్​ అవడం గ్యారెంటీ! - how to earn money through youtube

How Much Money Do YouTubers Make : నేడు యూట్యూబ్​ క్రియేటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీ అభిమానులతో పాటు, భారీగా డబ్బులు కూడా సంపాదిస్తుంటారు. మరి ఈ కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్​ ద్వారా ఎంత సంపాదిస్తున్నారో మీకు తెలుసా? తెలిస్తే కళ్లు తిరగాల్సిందే!

How to earn money on YouTube
How much money do YouTubers make

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 12:41 PM IST

How Much Money Do YouTubers Make : యూట్యూబ్​కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు చూసే యూజర్లు కొందరు అయితే, వీడియోలు పోస్టు చేస్తూ డబ్బులు సంపాదించేవారు మరికొందరు ఉన్నారు. అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, స్మార్ట్​ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో యూట్యూబ్ వాడేవారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్స్ ఆదాయం కూడా భారీగానే పెరుగుతోంది. 'ది సోషల్ షెపర్డ్' విడుదల చేసిన డేటా ప్రకారం, యూట్యూబ్​కు ప్రపంచవ్యాప్తంగా 2.7 బిలియన్ నెలవారీ యాక్టివ్ సబ్​స్క్రైబర్స్ ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్​లో 62 శాతం ఇంటర్నెట్ యూజర్లు ప్రతిరోజూ యూట్యూబ్​ యాక్సెస్ చేస్తారు. దీన్ని బట్టే చెప్పవచ్చు యూట్యూబ్​కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో. అంతేకాదు ప్రతి నిమిషాకి 500 గంటల నిడివి గల వీడియోలను యూట్యూబ్​ సర్వర్లలోకి అప్​లోడ్ చేస్తుంటారు. అమెరికాలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు యూట్యూబ్​ను చూస్తుంటారు. పిల్లలు యూట్యూబ్ వీడియోలను ఒక రోజులో కనీసం 77 నిమిషాలపాటు చూస్తారట.

యూట్యూబ్​ ఆదాయం ఎంతో తెలుసా?
యూట్యూబ్​కు ప్రతినెలా ఎంత ఆదాయం వస్తుందో తెలుస్తే షాక్ అవుతారు. 2022లో యూట్యూబ్ ఏకంగా 29.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎక్కువగా యాడ్స్, ప్రీమియం సబ్​స్క్రిప్షన్ సర్వీసుల నుంచే యూట్యూబ్​కు ఆదాయం వస్తుంది. అయితే యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. 'మిస్టర్ బీస్ట్' (ఛానల్​) ప్రతినెలా మిలియన్ల డాలర్ల మేర ఆదాయాన్ని సంపాదిస్తాడు. కానీ అందరూ మిస్టర్ బీస్ట్​లు కాలేరు. అది వేరే విషయం.

యూట్యూబ్​లో డబ్బు సంపాదించే మార్గాలు!
అసలుయూట్యూబ్ క్రియేటర్స్ నెలకు ఎంత సంపాదిస్తారు? యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? యూట్యూబ్​లో వీడియోలు అప్లోడ్ చేయగానే వైరల్ అవ్వడం ఎలా? వాస్తవానికి ఇదంతా అంత ఈజీ కాదు. యాడ్స్ ద్వారా ఆదాయం, యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ, సూపర్ చాట్ అండ్ సూపర్ స్టిక్కర్‌లు, సూపర్ థాంక్స్, షాపింగ్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు లాంటి ఆరు విభిన్న ఫీచర్‌ల ద్వారా క్రియేటర్‌లు డబ్బు సంపాదించవచ్చు. అయితే ఇంతకంటే ముందు యూట్యూబ్ పార్టనర్​షిప్​ ప్రోగ్రామ్‌లో చేరేందుకు తగిన అర్హతలు మీరు సంపాదించాల్సి ఉంటుంది.

యూట్యూబ్‌లో డబ్బు సంపాదించడం ఎలా?
మీరు యూట్యూబ్ ఛానల్‌ని యాడ్స్ ద్వారా లేదా యూట్యూబ్ ప్రీమియం ద్వారా మానిటైజ్ చేయాలనుకుంటే, మీరు కనీసం 1,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి. అయితే, దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. మీ ఛానల్ దీర్ఘకాల వీడియోలపై దృష్టి సారిస్తే, మీరు 12 నెలల్లో 4,000 వాచ్​ హవర్స్​ను సాధించి ఉండాలి. షార్ట్స్ ఛానల్‌కు, గత మూడు నెలల్లో 10 మిలియన్ వ్యూస్ వచ్చి ఉండాలి. అయితే ఇది కేవలం బేసిక్ రిక్వైర్​మెంట్​ మాత్రమేనని మీరు గుర్తుంచుకోవాలి.

థ్రెషోల్డ్​
సూపర్ చాట్ అండ్ సూపర్ స్టిక్కర్‌లు, సూపర్ థాంక్స్, షాపింగ్ ఛానల్ మెంబర్‌షిప్‌ల సబ్​స్క్రైబర్స్​, వాచింగ్ హవర్స్​ థ్రెషోల్డ్‌ కొద్దిగా తక్కువగా ఉంటుంది. మీరు గత మూడు నెలల్లో మూడు వీడియో అప్‌లోడ్‌లు చేసి ఉండాలి. లాంగ్ వీడియోలు అయితే 3000 వాచింగ్ హవర్స్​, షార్ట్ వీడియోలు అయితే 3 మిలియన్ వ్యూస్​ వచ్చి ఉండాలి. పైగా మీకు 500 మంది సబ్‌స్క్రైబర్‌లు కూడా ఉండాలి. మీరు ఇతర బ్రాండ్‌ల ఉత్పత్తులను విక్రయించాలని అనుకుంటే, మీరు యునైటెడ్ స్టేట్స్ లేదా దక్షిణ కొరియాలో ఉంటేనే సాధ్యమవుతుంది. మీరు నిర్దిష్ట వీడియో వాచింగ్ హవర్స్ థ్రెషోల్డ్‌లను కలిగి ఉండాలి లేదా మీ ఛానెల్‌కు 20,000 కంటే మించి సబ్​స్క్రైబర్స్ ఉండాలి.

యూట్యూబ్​ కంటెంట్​ క్రియేటర్‌లు ఎలా సంపాదిస్తారు?
సోషల్ మీడియా అనలిటిక్స్ వెబ్‌సైట్ 'సోషల్ బ్లేడ్‌' ద్వారా ఒక యూట్యూబ్​ ఛానల్​కు ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవచ్చు. యూట్యూబ్​లో మీరు అప్లోడ్ చేసిన వీడియోకు ఒక రోజులో 1000 వ్యూస్ వస్తే, కాస్ట్ ఫర్​ 1000 యాడ్​ ఇంప్రెషన్స్​ (CPM) ప్రకారం, మీకు 0.25 డాలర్లు - 3 డాలర్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఒక సాధారణ యూట్యూబర్​ నెలకు 7.50 డాలర్ల నుంచి 90 డాలర్ల వరకు సంపాదించవచ్చు. అయితే మీ యూట్యూబ్ ఛానల్ నీష్​, మీ వీడియో టైమ్​, ఏ దేశం నుంచి వ్యూయర్స్ చూస్తున్నారు - అనే దానిని బట్టి ఈ సీపీఎం రేట్లు మారుతూ ఉంటాయి.

వ్యూస్​ కోసం మాత్రమే వీడియోలు పెట్టకూడదు!
చాలా మంది కేవలం వ్యూస్ కోసం మాత్రమే యూట్యూబ్ వీడియోస్ పెడుతుంటారు. ఇది సరైన విధానం కాదు. యూజర్లకు ఉపయోగపడే వీడియోలను, క్రమం తప్పకుండా అందిస్తూ ఉండాలి. అప్పుడే క్రమంగా మీ ఛానల్ వ్యూస్​ పెరుగుతాయి. సబ్​స్క్రైబర్లు సపోర్ట్ కూడా లభిస్తుంది. అప్పుడే మీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతుంది.

మిడ్-లెవల్ యూట్యూబర్స్ - ఆదాయం ఎంత?
యూట్యూబ్ ఛానల్​ రన్ చేసే వాళ్లందరూ మిసర్ట్ బీస్ట్ కాలేరు. యూట్యూబ్ ఛానల్​ పెట్టినవాళ్లంతా సక్సెస్ కాలేరు. యూట్యూబ్​లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నవారంతా సంపాదిస్తున్నారనుకోవడం పొరపాటే. 'సోషల్ బ్లేడ్' వెబ్​సైట్​ ప్రకారం, ఒక వీడియోను అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోకు రోజువారి వ్యూస్ 50వేలకు పైగా వ్యూస్ వస్తే, అప్పుడే సీపీఎం అనేది 0.25 డాలర్ల నుంచి 3 డాలర్ల మధ్య ఉంటుంది. అప్పుడే సదరు యూట్యూబర్​ సంవత్సరానికి 4,500 డాలర్లు - 54,000 డాలర్ల మధ్య రెవెన్యూ సంపాదించగలడు. అయితే ఇది కేవలం యాడ్స్ ద్వారా మాత్రమే వచ్చే ఆదాయం అని గుర్తుంచుకోవాలి. కనుక మిడ్ లెవల్ యూట్యూబర్స్​ తమ జీవనోపాధికి ఎలాంటి ఢోకా లేకుండా బతుకగలుగుతారు.

సక్సెస్​ఫుల్ యూటబర్లకు మంచి ఫాలోయింగ్​, కమ్యూనిటీ సపోర్ట్​ ఉంటుంది. పైగా వారికి స్పాన్సర్​షిప్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా వారికి కమీషన్స్ వస్తాయి. ఒకవిధంగా చెప్పాలంటే మిడ్ లెవల్ యూట్యూబర్‌లు సాధారణంగా యాడ్ మీద వచ్చే ఆదాయం కంటే స్పాన్సర్‌షిప్ డీల్స్ ద్వారానే ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉంటారు.

మిస్టర్ బీస్ట్, జెఫ్రీ స్టార్, మార్కిప్లియర్ లాంటి యూట్యూబర్‌లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీరు యూట్యూబ్​ ద్వారా వేల కోట్ల సంపాదిస్తున్నారు. మరి మీరు కూడా వీరిలానే యూట్యూబ్ స్టార్​ అవుదామని అనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, పక్కా ప్లాన్​తో మంచి యూట్యూబ్​ కంటెంట్​ను క్రియేట్​ చేసి, అభిమానులతోపాటు మంచి ఆదాయాన్ని కూడా సంపాదించండి. ఆల్​ ది బెస్ట్​!

ఓపెన్ AI మరో సంచలనం- మ్యాటర్ ఇస్తే వీడియో రెడీ- ఎలా పనిచేస్తుందంటే?

మీ ఫోన్​/ ట్యాబ్​ నీటిలో పడిపోయిందా? ఈ సింపుల్​ చిట్కాలతో వాటిని సేవ్​ చేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details