Elevate Black Edition Launched: జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ దేశీయ మార్కెట్లో దాని మిడ్-సైజ్ SUV హోండా ఎలివేట్ బ్లాక్ వెర్షన్‌ను ప్రారంభించింది. కంపెనీ ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూ. 15.51 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకొచ్చింది. దీంతోపాటు హోండా ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్‌ను కూడా ప్రవేశపెట్టింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 15.71 లక్షల (ఎక్స్-షోరూమ్).
ఈ ప్రత్యేక ఎడిషన్లన్నీ కారు టాప్-స్పెక్ ZX ట్రిమ్ ఆధారంగా రూపొందించారు. వీటిలో మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మార్కెట్లో వీటి సేల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటితోపాటు గతేడాది లాంఛైన హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ కూడా మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఫీచర్లు: హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ పూర్తిగా నల్లటి ఇంటీరియర్, అల్లాయ్ వీల్స్‌తో పాటు క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ పెయింట్ షేడ్ ఎక్స్టీరియర్ను కలిగి ఉంటుంది. దీని డోర్స్ కింది భాగం, అప్పర్ గ్రిల్, రూఫ్ రైల్స్‌పై సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది.
ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 15.71 లక్షలు. ఇక దీని CVT వేరియంట్ ధర రూ. 16.93 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఒక అడుగు ముందుకు వేసి అన్ని సిల్వర్ భాగాలపై బ్లాక్ ఫినిష్‌తో వస్తుంది. ఇది ఏడు రంగుల యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్‌ను కలిగి ఉంది.
స్టాండర్డ్ ఎలివేట్ SUV మాదిరిగానే ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లెథరెట్ సీట్లు, సింగిల్-పేన్ సన్‌రూఫ్, కెమెరా-బేస్డ్ ADAS, ఆటో హెడ్‌లైట్స్ అండ్ వైపర్స్, సెమీ-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7.0-అంగుళాల TFT డిస్ప్లే వంటివి ఉన్నాయి.