Honda Elevate Black Edition:హోండా కార్స్ ఇండియా త్వరలో తన మిడ్-సైజ్ SUV హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్‌ను విడుదల చేయబోతోంది. రీసెంట్గా ఈ వెర్షన్ ప్రొడక్షన్-రెడీ ఇమేజ్‌లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో ఇది త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
హోండా కార్స్ ఈ SUVని రెండు వెర్షన్లలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వాటిలో మొదటిది ఎలివేట్ బ్లాక్ ఎడిషన్. ఇక రెండోది ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్. ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ స్పెషల్ ఎడిషన్ జనవరి 7న విడుదల కానుంది.
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ డిజైన్:హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్.. క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ ఎక్స్‌టీరియర్ పెయింట్, గ్లోస్ బ్లాక్ పెయింటెడ్ అల్లాయ్ వీల్స్, ఎగువ గ్రిల్‌పై క్రోమ్ ఫినిషింగ్, రూఫ్ రైల్స్‌పై సిల్వర్ ఫినిషింగ్, డోర్‌ల దిగువ భాగంలో సిల్వర్ ఫినిషింగ్‌తో వస్తుంది. దీని ఇంటీరియర్‌లో ఆల్-బ్లాక్ లెథెరెట్ సీట్లు ఇవ్వనున్నారు.
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్.. ఎక్ట్సీరియర్, ఇంటీరియర్, అల్లాయ్ వీల్స్ ఒకే విధమైన సెటప్‌ను కలిగి ఉంటాయి. ఇది బ్లాక్-పెయింటెడ్ అప్పర్ గ్రిల్, రూఫ్ రైల్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్లతో పాటు డోర్స్ దిగువ భాగంలో బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ ప్రత్యేక వేరియంట్లో ఫ్రంట్ ఫెండర్‌తో 7-రంగుల ఇంటీరియర్ యాంబియంట్ లైటింగ్‌పై అదనంగా లోగో కూడా ఉంటుంది.