Free Bikes Replacement Parts:ప్రస్తుతం బైక్స్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బైక్‌పై రయ్ రయ్ మంటూ దూసుకుపోవడమంటే యువతకు భలే సరదా. బైకుల సేల్స్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని బైక్స్ కంపెనీలు ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. అయితే ఈ నాలుగేళ్లలో కొన్న ఆ ప్రత్యేక మోడల్స్ బైకులకు ఉచితంగా పార్టులు మార్చేందుకు ఓ ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రీకాల్ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ రీకాల్ ప్రక్రియ ఎందుకు? ఈ జాబితాలో ఉన్న మోడల్స్ ఏంటి? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.
Honda Recall:హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఈ రీకాల్ చేపట్టింది. వీల్ స్పీడ్ సెన్సర్, క్యామ్‌షాఫ్ట్‌లో లోపాల కారణంగా ఈ రీకాల్ చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ జాబితాలో ఉన్న మోడల్స్ ఇవే!:
- కంపెనీ రీకాల్ చేపట్టిన జాబితాలో సీబీ300ఎఫ్, సీబీ 300ఆర్, సీబీ 359, హెచ్‌నెస్ 350, సీబీ 350ఆర్‌ఎస్ మోడల్స్ ఉన్నాయి.
- 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన ఈ మోడల్ బైక్స్ ఇందులో ఉన్నాయి.
ఈ రీప్లేస్‌మెంట్ ప్రక్రియ ఎందుకు?
- మోల్డింగ్ విధానంలో మిస్టేక్స్ వల్ల స్పీడ్ సెన్సర్‌లోకి నీరు చొరబడే అవకాశం ఉందని, దీనివల్ల స్పీడ్ సెన్సర్‌తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ లేదా ఏబీఎస్ కూడా పనిచేయకపోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
- కొన్ని సందర్భాల్లో బ్రేకింగ్‌లోనూ లోపాలు తలత్తొచ్చని తెలిపింది.
- 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన యూనిట్లలో ఈ సమస్య ఉత్పత్తన్నమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
- వీటితోపాటు 2024 జూన్, జులై మధ్య తయారైన సీబీ350, హెచ్‌నెస్ సీబీ 350, సీబీ 350ఆర్‌ఎస్ మోడళ్లలో క్యామ్‌షాఫ్ట్‌లో పనితీరులోనూ లోపం ఉన్నట్లు గుర్తించామని కంపెనీ తెలిపింది.
- ముందు జాగ్రత్త చర్యగా సంబంధిత పార్టులను ఉచితంగా రీప్లేస్ చేస్తున్నామని పేర్కొంది.
- వారెంటీతో సంబంధం లేకుండా కంపెనీకి చెందిన అన్ని బిగ్‌వీల్ డీలర్‌షిప్ కేంద్రాల్లో ఈ రీప్లేస్‌మెంట్ ప్రక్రియ చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
స్టన్నింగ్ లుక్స్‌తో మార్కెట్లోకి రెండు కొత్త బైకులు- ధర ఎంతో తెలుసా? - Bajaj Auto Launches Two New Bikes
స్పోర్టీ లుక్‌తో 'జావా 42 ఎఫ్‌జె' లాంచ్- ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? - Jawa Yezdi 42 FJ350 Launched