తెలంగాణ

telangana

ETV Bharat / technology

గుడ్​ న్యూస్​ - 'X' ప్రీమియం యూజర్లకు​ త్వరలోనే 'గ్రోక్'​ ఏఐ యాక్సెస్​! - Grok AI For All X Premium Users - GROK AI FOR ALL X PREMIUM USERS

Grok AI For All X Premium Users : ఎక్స్​ ప్రీమియం యూజర్లకు గుడ్ న్యూస్​. వచ్చేవారం నుంచి ఎక్స్ ప్రీమియం యూజర్లకు కూడా గ్రోక్​ ఏఐ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఇది కేవలం ప్రీమియం ప్లస్​ సబ్​స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు మీ కోసం.

New Features for X Premium users
Grok AI for all X Premium users

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 12:17 PM IST

Grok AI For All X Premium Users :అమెరికన్​ బిలియనీర్ ఎలాన్ మస్క్‌ 'ఎక్స్' (ట్విట్టర్) ప్రీమియం యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చేవారం నుంచి ఎక్స్​ ప్రీమియం యూజర్లకు గ్రోక్ ఏఐ ఫీచర్​ను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.

కృత్రిమ మేధ సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ (Grok) ఇప్పటి వరకు కేవలం ఎక్స్​ ప్రీమియం ప్లస్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కానీ మరోవారం రోజుల్లో ఇది ప్రీమియం యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. మరి ఎలాన్​ మస్క్​ ఈ కీలక నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసా?

యూజర్లు తగ్గిపోతున్నారు!
‘ఎక్స్‌’ ప్లాట్​ఫాం వాడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ ఎక్స్ సామాజిక మాధ్యమానికి వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎలాన్​ మస్క్‌ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎక్స్ ప్లాట్​ఫామ్​కు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు, అలాగే​ సబ్‌స్క్రైబర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు మస్క్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా గ్రోక్‌ను (Grok) ఎక్స్‌ ప్లాట్​ఫాంకు అనుసంధానిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో ఎక్స్‌ను వాడుతున్న వారి సంఖ్య ఫిబ్రవరి నాటికి వార్షిక ప్రాతిపదికన 18 శాతం తగ్గినట్లు సెన్సర్‌ టవర్‌ నివేదిక వెల్లడించింది. మరీ ముఖ్యంగా ట్విట్టర్ ప్లాట్​ఫామ్​ను​ ఎలాన్ మస్క్​ కొనుగోలు తర్వాత, యూజర్ల సంఖ్య 23 శాతం వరకు పడిపోయినట్లు సదరు నివేదిక పేర్కొంది.

ఏఐ వార్​!
ఎలాన్ మస్క్​ చాట్‌జీపీటీ సహా మార్కెట్‌లో ఉన్న ఇతర ఏఐ చాట్‌బాట్‌లకు పోటీగా గ్రోక్‌ ఏఐను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏఐ చాట్​బాట్​ను ఎక్స్‌ ప్లాట్​ఫామ్​కు అనుసంధానించడం వల్ల అటు ఎక్స్​కు, ఇటు గ్రోక్​ ఏఐకూ మరింత ఆదరణ పెరుగుతుందని మస్క్‌ భావిస్తున్నారు.

యూట్యూబ్​కు పోటీగా X వీడియోస్
ఎలాన్ మస్క్​ ఇంతకు ముందు యూట్యూబ్​ మాదిరిగా ఎక్స్​ ప్లాట్​ఫామ్​లోనూ లాంగ్​-ఫార్మ్ వీడియో స్ట్రీమింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనితో యూజర్లు తమ స్మార్ట్​ టీవీలో ఈ లాంగ్ వీడియోలను చూడగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ఎక్స్​ కంపెనీ ఇప్పటికే అమెజాన్​, శాంసంగ్​ స్మార్ట్ టీవీల కోసం ఒక టీవీ యాప్​ను తీసుకువస్తోంది. త్వరలోనే అది లాంఛ్ కానుంది. ఇదే కనుక అందుబాటులోకి వస్తే, మీ స్మార్ట్​టీవీలోనే నేరుగా ఎక్స్ లాంగ్ వీడియోలను చూడడానికి వీలవుతుందని ఎలాన్ మస్క్​ తెలిపారు.

OTP మోసాలకు చెక్- హైదరాబాదీ సాఫ్ట్‌వేర్‌తో ఇక హ్యాకర్లకు చుక్కలే! - OTP Frauds Solution

గూగుల్​లో ఉన్న మీ పర్సనల్​ డేటాను డిలీట్​ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Delete My Activity In Google

ABOUT THE AUTHOR

...view details