తెలంగాణ

telangana

ETV Bharat / technology

AI సపోర్ట్​తో - గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్​ఫోన్​ లాంఛ్ - ధర, ఫీచర్ల వివరాలివే! - Google Pixel 8a Phone Lunch - GOOGLE PIXEL 8A PHONE LUNCH

Google Pixel 8a Phone Lunch : గూగుల్​ పిక్సెల్​ ఫోన్​ లవర్స్​కు గుడ్ న్యూస్. ఏఐ టెక్నాలజీతో గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ ఇండియాలో లాంఛ్ అయ్యింది. దీని ఫీచర్స్​, స్పెక్స్​, ధర తదితర పూర్తి వివరాలు మీ కోసం.

Google Pixel 8a Phone Lunch
Google Pixel 8a Phone Lunch (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 5:30 PM IST

Google Pixel 8a Phone Lunch : టెక్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ స్మార్ట్​ఫోన్‌ భారత్‌లోకి వచ్చేసింది. ఈ కొత్త ఫోన్‌ గూగుల్‌ టెన్సార్‌ జీ3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పిక్సెల్‌ 8, పిక్సెల్‌ 8ప్రో తరహాలోనే జెమిని, బెస్ట్ టేక్‌, ఆడియో మ్యాజిక్‌ ఎరేజర్‌ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్​ను అందుబాటులోకి వచ్చేసింది.

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫీచర్లు
Google Pixel 8a Features :

  • డిస్​ప్లే - 6.61 అంగుళాలు
  • ప్రాసెసర్​ - టెన్సార్‌ జీ3
  • రిజల్యూషన్ - 1080 x 2400 పిక్సెల్స్
  • ఓఎస్ - ఆండ్రాయిడ్ 14
  • ర్యామ్ - 8జీబీ
  • స్టోరేజ్​ - 128 జీబీ, 256 జీబీ
  • మెయిన్ కెమెరా - 64 MP + 13 MP అల్ట్రావైడ్ లెన్స్
  • సెల్ఫీ కెమెరా - 13 MP
  • బ్యాటరీ - 5000 mAh
  • ఛార్జింగ్ సపోర్ట్​ - 18W
  • కనెక్టివిటీ - వైఫై 6, బ్లూటూత్​ 5.3, ఎన్‌ఎఫ్‌సీ

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ స్మార్ట్​ఫోన్​లోవీడియోలు రికార్డ్‌ చేసేటప్పుడు అనవసర శబ్దాలను తొలగించేలా ఆడియో మ్యాజిక్‌ ఎరేజర్‌ కూడా ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేటు, 2,000nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.1 అంగుళాల డిస్​ప్లే ఉంది. దీనికి కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ రక్షణ ఉంది. అలాగే ఏడేళ్ల పాటు ఓఎస్‌, సెక్యూరిటీ, ఫీచర్‌ డ్రాప్‌ అప్‌డేట్లు ఇవ్వనున్నారు.

Google Pixel 8a Color Variants : ఈ గూగుల్ పిక్సెల్​ 8ఏ మార్కెట్​లో నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఎప్పటిలాగే అబ్సీడియన్, పోర్సిలిన్​తో పాటు ఈసారి కొత్తగా అలో, బే రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది.

గూగుల్ పిక్సెల్ 8ఏ ధర
Google Pixel 8a Price :

  • గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్లు మే 14 నుంచి మార్కెట్​లో అందుబాటులోకి వస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ముందస్తుగా ఆర్డర్‌ చేయొచ్చు.
  • గూగుల్ పిక్సెల్ 8ఏ 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.52,999గా ఉంది.
  • మార్కెట్​లో గూగుల్ పిక్సెల్ 8ఏ 256జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్‌ ధర రూ.59,999గా ఉంది.
  • ముందుగా ఆర్డర్‌ చేసుకున్నవారు రూ.999కే పిక్సెల్‌ ఏ-సిరీస్‌ బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు.
  • బ్యాంకు కార్డులపై రూ.4000 వరకు క్యాష్​బ్యాక్ లభిస్తుంది.
  • కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌పై రూ.9,000 వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కూడా పొందొచ్చు.

ఇన్‌స్టాలో 4 సరికొత్త ఫీచర్లు - DM చేస్తేనే స్టోరీ - షేక్‌ చేస్తే ఫొటో - ఇంకా అవి కూడా! - Instagram Features

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్ - వెంటనే ఆ Apps డిలీట్ చేయండి - లేకుంటే ఇక అంతే! - Android Phone Users Alert

ABOUT THE AUTHOR

...view details