Google Learn About AI Tool: టెక్ దిగ్గజం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. 'లెర్న్ అబౌట్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ యూజర్లకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఈ విద్యా ప్రపంచంలో విద్యార్థులు, విద్యావేత్తలకు కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ను అందించడమే లక్ష్యంగా గూగుల్ దీన్ని తీసుకొచ్చింది.
ఈ లెర్న్ అబౌట్ ఫీచర్‌ను గూగుల్ LearnLM AI మోడల్ ద్వారా తీసుకొచ్చారు. ఇది వినియోగదారులు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సహాయపడుతుంది. అంటే ఇది యూజర్లకు ఓ టీచర్ మాదిరిగా గైడ్ చేస్తుంది. ఇది ప్రతి అంశంపై మరింత సమగ్రమైన అవగాహనను అందించేందుకు సంబంధిత ఆర్టికల్స్, వీడియోస్‌ను కూడా అందిస్తుంది. ఈ లెర్న్ అబౌట్ ఫీచర్ అకాడమిక్ రీసెర్చ్‌కు బాగా ఉపయోగపడుతుంది.
ఇది ChatGPT, Gemini వంటి AI చాట్‌బాట్‌ల మాదిరిగా కాకుండా కాస్త డిఫరెంట్‌గా పనిచేస్తుంది. ఈ లెర్న్ అబౌట్ ఫీచర్ విశ్వసనీయ ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరించి అందిస్తుంది. ఉదాహరణకు గూగుల్జెమిని ఏఐ ఫీచర్‌ను సాధారణంగా ఏవైనా ప్రశ్నలు అడిగితే అది వికీపీడియా నుంచి డేటాను సేకరించి అందిస్తుంది. అయితే లెర్న్ ఎబౌట్ ఫీచర్ మాత్రం యూనివర్స్ సైజ్ గురించి అడిగితే అది ఎడ్యూకేషనల్ సైట్స్, ఫిజిక్స్ ఫోరమ్‌ల నుంచి సమాచారాన్ని సేకరించి అందిస్తుందని ది వెర్జ్ నివేదిక పేర్కొంది.