Google Launched Gemini Live: ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. తన AI చాట్‌బాట్ ఆధారిత టూ-వే వాయిస్ చాట్ ఫీచర్ 'గూగుల్ జెమినీ లైవ్'ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి టైప్ చేయకుండానే దేని గురించి అయినా మాట్లాడొచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఏంటీ ఫీచర్? ఇది ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా? వంటి వివరాలు మీకోసం.
ఏంటీ జెమిని లైవ్ ఫీచర్?:
- జెమిని లైవ్ అనేది Google AI చాట్‌బాట్ ఆధారిత టూ- వే వాయిస్ చాట్ ఫీచర్.
- ఈ సరికొత్త ఫీచర్ ఇప్పుడు Android వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది.
- ఈ ఫీచర్‌ను మొదట్లో Google One AI ప్రీమియం ప్లాన్ ద్వారా జెమిని అడ్వాన్స్‌డ్ యూజర్స్‌కు తీసుకొచ్చారు.
- కానీ ఇప్పుడు కంపెనీ వినియోగదారులందరికీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
- అయితే ఈ ఫీచర్ బేసిక్ వెర్షన్‌ను మాత్రమే యూజర్స్‌కు అందుబాటులో ఉంది.
Google Launched Gemini Live (Getty Images) జెమిని ఐఫోన్ వినియోగదారులకు కాదు:
- ఈ సరికొత్త జెమినీ లైవ్ ఫీచర్ ఐఫోన్ వినియోగదారులకు కాదు.
- ఐఫోన్ యూజర్స్ జెమిని యాప్ ఇప్పటికీ iOSలో అందుబాటులో లేదనే విషయం గమనించాలి.
- కనుక iPhone వినియోగదారులకు Gemini Live ఫీచర్ కూడా అందుబాటులో ఉండదు.
జెమిని లైవ్ ఫీచర్ బెనిఫిట్స్:
- ఈ సరికొత్త ఫీచర్‌తో టైప్ చేయకుండానే దేని గురించి అయినా మాట్లాడొచ్చు.
- Gemini తిరిగి మాటల రూపంలో మనకు సమాధానం ఇస్తుంది.
- ఐడియాస్ కూడా ఇస్తుంది: ఈవెంట్స్ ప్లానింగ్, బిజినెస్ ప్లాన్, మీ ప్రియమైనవారి కోసం ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది? వంటి వాటిపై Geminiతో చర్చిస్తే మీకు మంచి ఐడియాస్ ఇస్తుంది.
- అన్వేషించొచ్చు: మీకు ఆసక్తి ఉన్న టాపిక్స్‌పై మరిన్ని వివరాలను Geminiని అడిగి తెలుసుకోవచ్చు.
- రిహార్సల్ చేయొచ్చు:ముఖ్యమైన అకేషన్స్ కోసం మరింత సహజమైన, ఇంటరాక్టివ్ పద్ధతిలో రిహార్సల్ చేయొచ్చు.
- అయితే ఈ Gemini Live ఫీచర్‌ను దశలవారీగా Android మొబైల్ డివైజ్‌లలో ఇంగ్లీష్ భాషలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది మీకు ఇంకా అందుబాటులో ఉండకపోవచ్చు.
Google Launched Gemini Live (Getty Images) జెమిని లైవ్ ఫీచర్‌ని ఉపయోగించడం ఎలా?:
- Android మొబైల్ డివైజ్‌లలో Gemini యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి.
- తర్వాత జెమిని యాప్‌ను ఓపెన్ చేస్తే స్క్రీన్కు దిగువన కుడివైపున ఉన్న వేవ్‌ఫార్మ్ ఐకాన్ కన్పిస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే మొదటిసారి వినియోగదారులు టర్మ్స్ అండ్ కండిషన్స్ మెను కన్పిస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి.
- ఇప్పుడు మీరు జెమిని లైవ్ ఇంటర్‌ఫేస్‌ని చూడొచ్చు.
- అంతే ఇక మీరు ఈ ఫీచర్‌తో మీ సంభాషణ కొనసాగించొచ్చు.
ఇకపై వాట్సాప్ వాయిస్ మెసెజ్ టెక్ట్స్ రూపంలో- కొత్త ఫీచర్ యాక్టివేట్ చేసుకోండిలా! - WHATSAPP VOICE NOTE TRANSCRIPTS
పిల్లల యూట్యూబ్ నియంత్రణ పేరెంట్స్ చేతిలో- సరికొత్త ఫీచర్ యాక్టివేట్ చేసుకోండిలా! - Youtube Teenage Safety Feature