Google Appoints New Chief Technologist:గూగుల్ తన కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌గా ప్రభాకర్ రాఘవన్‌ను నియమించింది. మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఏఐ వంటి టెక్ ప్రత్యర్థులు, పెర్‌ప్లెక్సిటీ వంటి అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌ల నుంచి పెరుగుతున్న పోటీని పరిష్కరించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, యాడ్స్, కామర్స్, పేమెంట్స్‌కు బాధ్యత వహిస్తున్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్‌ను చీఫ్ టెక్నాలజిస్ట్‌గా నియమిస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఈ సందర్భంగా గత 12 సంవత్సరాలుగా రాఘవన్ చేసిన సేవలను గుర్తుచేస్తూ సీఈవో పిచాయ్ కొనియాడారు.
ప్రభాకర్ రాఘవన్ ఎవరు?:64 ఏళ్ల ప్రభాకర్ రాఘవన్ టెక్నాలజీప్రపంచానికి కొత్తేమీ కాదు. ఆయన 2012లో గూగుల్‌లో చేరడానికి ముందు యాహూలో పనిచేశారు. అక్కడ సెర్చ్, యాడ్ ర్యాంకింగ్, మార్కెట్‌ప్లేస్ డిజైన్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వత గూగుల్‌లో చేరిన ఆయన కెరీర్ గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్‌తో ప్రారంభమైంది. ఈ సమయంలో ఆయన స్మార్ట్ రిప్లై అండ్ స్మార్ట్ కంపోస్ వంటి ఏఐ- ఆధారిత ఫీచర్స్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర వహించారు.