తెలంగాణ

telangana

ETV Bharat / technology

నేడే హాట్‌స్టార్​లో జియో సినిమా విలీనం- కొత్త డొమైన్ ఇదేనా?

రిలయన్స్-స్టార్ ఇండియా విలీనం - తెరపైకి కొత్త డొమైన్!

Disney Reliance Merger Nears Completion
Disney Reliance Merger Nears Completion (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Nov 13, 2024, 12:57 PM IST

Disney Reliance Merger Nears Completion: రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ విలీన ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. రిలయన్స్‌, డిస్నీలకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నేడే విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విలీనం తర్వాత జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ రెండు ఓటీటీ ప్లాట్​ఫారమ్​లు కలసి ఒకే స్ట్రీమింగ్​ ప్లాట్​ఫారమ్​గా అవతరించనున్నాయి. ఈ నేపథ్యంలో 'జియోస్టార్‌' పేరితో ఓ కొత్త డొమైన్‌ తెరపైకి వచ్చింది. అయితే ఆ వెబ్​సైట్​లో ప్రస్తుతం 'కమింగ్ సూన్' అని మాత్రమే కన్పిస్తుంది.

జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్​ ప్లాట్​ఫారమ్​ల 'జియో స్టార్​' పై వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు సంస్థల విలీనం తర్వాత నవంబర్‌ 14 నుంచి ఈ డొమైన్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక నుంచి డిస్నీ+ హాట్‌స్టార్​, జియో సినిమాలోని కంటెంట్ అంతా ఒకే చోట దర్శనమివ్వనుంది. అయితే ఐపీఎల్‌, ఫిఫా వంటి లైవ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్లు మాత్రం హాట్‌స్టార్‌ యాప్‌లోనే ప్రసారం అవుతుందట. జియో సినిమాలో ప్రో కబడ్డీ లీగ్​ ప్రసారం అవుతుందని సమాచారం. వీక్షకులకు హై-ఎండ్, ప్రీమియం కంటెంట్​ను ఇవ్వడమే రెండు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ విలీనం అవుతాయన్న వార్తలు బయటకు వచ్చిప్పటి నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జియోహాట్‌స్టార్‌ పేరుతో కొత్త ఓటీటీప్లాట్‌ఫామ్‌ అవతరించబోతోందని వార్తలు రావడం, ఆ డొమైన్‌ తనదేనంటూ ఓ యాప్‌ డెవలపర్‌ ముందుకు రావడం, తన చదువుకయ్యే ఖర్చు మొత్తం రిలయన్సే భరించాలంటూ పేర్కొనడం అందరికీ తెలిసిందే.

ఓ దశలో తక్కువ మొత్తానికే రిలయన్స్‌కు ఇస్తానని పేర్కొని ఒక్కసారిగా ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత యూఏఈకి చెందిన ఇద్దరు చిన్నారులు తెరపైకి వచ్చి ఈ డొమైన్‌ను ఉచితంగా ఇస్తామని తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జియోహాట్‌స్టార్‌ డొమైన్‌ వ్యవహారానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ 'జియో స్టార్‌' అనే కొత్త వెబ్‌సైట్‌ దర్శనమిచ్చింది.

మీరు యాపిల్ డివైజస్ వాడుతున్నారా?- అయితే కేంద్రం హైరిస్క్ అలర్ట్- వెంటనే ఇలా చేయండి!

మార్కెట్లోకి లగ్జరీ కారు- 3.4 సెకన్లలో 0-100kmph వేగం- 'పెర్ఫార్మెన్స్​'లో దీనికి సాటే లేదుగా!

ABOUT THE AUTHOR

...view details