Nothing Own Operating System: మొబైల్ మోడళ్లలో సంచలనం సృష్టించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది. గూగుల్, యాపిల్ సంస్థలకు బిగ్ షాక్ ఇస్తూ తాను కూడా సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సొంతంగా ఓఎస్‌ను రూపొందించనున్నట్లు లండన్‌కు చెందిన ఈ కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని నథింగ్ ఫౌండర్, వన్ ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పై స్వయంగా వెల్లడించారు.
టెక్‌క్రంచ్ కంపెనీ నిర్వహించిన ఓ ఈవెంట్లో దీనిపై కార్ల్ పై మాట్లాడారు. ఐఓఎస్ కంటే మెరుగ్గా, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ధీటుగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించేందుకు కావాల్సిన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రస్తుత ట్రెండింగ్ సబ్జెక్ట్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లను కూడా యాడ్ చేస్తామన్నారు. సొంత ఓఎస్ ద్వారా యూజర్లకు మెరుగైన ఎక్స్పీరియన్స్ అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. తమకు నిధుల కొరత ఉన్నప్పటికీ కంపెనీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయగలదని కార్ల్ పై తెలిపారు.
గత కొంతకాలంగా స్మార్ట్ఫోన్ల మార్కెట్లో గూగుల్ ఆండ్రాయిడ్ హవా ఎంతగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా వరకు స్మార్ట్ఫోన్లు అన్నీ ఇదే ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంటాయి. అలాగే యాపిల్ కూడా సొంతగా ఐఓఎస్ అనే తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించికుంది. ప్రస్తుతం మార్కెట్లో వీటి ఆధిపత్యానికి చెప్ పెట్టేందుకు నథింగ్ కంపెనీ రెడీ అయింది.