Best Smart Home Devices Under Rs 5000 :టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రజలు స్మార్ట్ గ్యాడ్జెట్స్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. మరి మీరు కూడా ఇదే కోవకు చెందినవారా? అయితే ఇది మీ కోసమే. మీ ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చుకోవడానికి రూ.5000 బడ్జెట్లో లభించే టాప్-6 గ్యాడ్జెట్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.
1. Amazon Echo Dot 5th Gen
మీ ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చే వాటిలో అమెజాన్ ఎకో డాట్ ఫిఫ్త్ జెన్ ఒకటి. ఇదొక స్మార్ట్ స్పీకర్. ఇది లైట్లు ఆన్ చేయడానికి, మ్యూజిక్ ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ.5,499.
2. Wipro LED Bulb
విప్రో బల్బు ఎకో డాట్ వంటి అమెజాన్ అలెక్సా స్పీకర్లతో పనిచేస్తుంది. దీని ధర రూ.749. ఈ ఎల్ఈడీ బల్బ్‌తో మ్యూజిక్‌ను సింక్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు కోరుకుంటే ఈ బల్బు 16 మిలియన్ రంగుల్లో ప్రకాశిస్తుంది.
3. QUBO WiFi BT Smart Plug
క్యూబో వైఫై బీటీ స్మార్ట్ ప్లగ్ ధర రూ.799. దీని ద్వారా నాన్-స్మార్ట్ గాడ్జెట్‌ను కూడా స్మార్ట్ డివైజ్‌గా మార్చుకోవచ్చు. ఉదాహరణకు మీరు మీ పర్సనల్ కంప్యూటర్ ప్లగ్ లేదా మొబైల్ ఛార్జింగ్ అడాప్టర్‌ను దీనికి కనెక్ట్ చేసుకొని, వాటిని మీ ఫోన్‌తో ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.
4. QUBO Smart WiFi Video Doorbell
క్యూబో స్మార్ట్ వైఫై వీడియో డోర్ బెల్ తప్పనిసరిగా మీ ఇంట్లో ఉండాల్సిన స్మార్ట్ హోమ్ డివైజ్. దీనిలో 1080 పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది 2వే టాక్ ఫీచర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ డివైజ్ ఎకో, గూగుల్ హోమ్ స్పీకర్ల ద్వారా అలెక్సా, ఓకే గూగుల్ కమాండ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.
5. Tapo TP Link C200 Smart Camera
ఈ స్మార్ట్ కెమెరా ధర రూ.1,799. ఇది 360 డిగ్రీ యాంగిల్ సపోర్ట్‌తో, 2ఎంపీ, 1080 పిక్సెల్ వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 2వే ఆడియో ఫీచర్, నైట్ విజన్ కూడా ఉంది. అది అలెక్సాను కూడా సపోర్ట్ చేస్తుంది.
6. Atomberg Renesa Smart Fan
ఆటమ్బెర్గ్ రెనెసా స్మార్ట్ ఫ్యాన్ ధర రూ.3,899. ఇది అమెజాన్ ఎకో డాట్, గూగుల్ హోమ్ వాయిస్ అసిస్టెంట్లకు సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు ఆటమ్బెర్గ్ యాప్‌తో కూడా ఈ స్మార్ట్ ఫ్యాన్‌ను ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు.