Best Mobile Phones Under 20000 : నేడు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. బెస్ట్ ఫీచర్స్, స్పెక్స్ ఉన్న ఫోన్లు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. కానీ వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని ప్రతిఒక్కరూ కొనలేరు. దీనిని దృష్టిలో ఉంచుకునే, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు అన్నీ తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లు ఉన్న మొబైల్స్‌ను రూపొందించి, మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.20,000 బడ్జెట్లోని టాప్-5 స్మార్ట్ఫోన్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. OnePlus Nord CE 3 Lite 5G Features : రూ.20 వేలు బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్నాయి. దీనిలోని కెమెరాలు హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీయడానికి చాలా అనువుగా ఉంటాయి.
- డిస్ప్లే : 6.2 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 256 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 108 MP + 2MP + 2 MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
OnePlus Nord CE 3 Lite 5G Price : మార్కెట్లో ఈ వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.19,392 ఉంటుంది.
2. IQOO Z7 5G Features :సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారికి ఈ ఐకూ జెడ్7 స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. దీనితో బెస్ట్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి వీలవుతుంది. తక్కువ బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
- డిస్ప్లే : 6.38 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్
- ర్యామ్ : 6 జీబీ
- స్టోరేజ్ :128 జీబీ
- బ్యాటరీ : 4500 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా : 64 MP +2 MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP
IQOO Z7 5G Price : మార్కెట్లో ఈ ఐకూ జెడ్7 5జీ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.18,999 ఉంటుంది.
3. Samsung Galaxy A14 5G Features : తక్కువ బడ్జెట్లో మంచి బ్రాండెడ్ ఫోన్ కొనాలని అనుకునేవారికి శాంసంగ్ గెలాక్సీ ఏ14 మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.6 అంగుళాల డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా-కోర్ 2.4GHz ప్రాసెసర్
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ
- రియర్ కెమెరా :50 MP +2 MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16 MP