Best Mini AC Under 2000 :ఎండా కాలం మొదలైంది. ఉక్కపోత కూడా క్రమంగా పెరుగుతోంది. కనుక ఈ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఎలక్ట్రికల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ ఏసీ, కూలర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. వీటిలో అత్యంత ఖరీదైన ఏసీలతో పాటు, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటే ఏసీ, కూలర్లు కూడా ఉన్నాయి. వాటిలో రూ.500 - రూ.2000 ప్రైస్ రేంజ్‌లోని టాప్-10 మినీ ఏసీ కూలర్ల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. Charkee Mini Cooler AC : ఈ ఛార్కీ మినీ కూలర్ ఏసీ చాలా చిన్న సైజులో, ఎక్కడికైనా పట్టుకెళ్లడానికి అనువుగా (పోర్టబుల్‌గా) ఉంటుంది. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని బెడ్ రూమ్, ఆఫీస్ రూమ్, సహా చిన్నచిన్న గదుల్లో వాడుకోవచ్చు. మార్కెట్లో ఈ ఛార్కీ మినీ కూలర్ ఏసీ ధర సుమారుగా రూ.499 ఉంటుంది.
2. Semaphore Mini AC : ఈ సెమాఫోర్ మినీ ఏసీని చిన్న గదుల్లో చక్కగా వాడుకోవచ్చు. ఇది పోర్టబుల్‌గా ఉంటుంది కనుక నచ్చిన చోటుకి ఈజీగా తీసుకెళ్లవచ్చు. యూఎస్బీ పవర్ సోర్స్ ద్వారా ఇది పని చేస్తుంది. దీనిని ఆఫీసు గదిలో, బెడ్ రూమ్‌లో గదుల్లో వాడుకోవచ్చు. దీనిలోని ఫ్యాన్ స్పీడ్‌ను కూడా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.399 ఉంటుంది.
3. Daybetter Mini AC : ఈ డేబెటర్ మినీ ఏసీ అనేది బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది చాలా కాంపాక్ట్ సైజ్‌లో ఉంటుంది. దీనిలో కలర్‌ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ కూడా ఉంటుంది. దీనిలోని ఫ్యాన్ స్పీడ్‌ను ఎడ్జెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఈ మినీ ఏసీ ధర సుమారుగా రూ.499 ఉంటుంది.
4. Creodec Mini Cooler :ఈ క్రియోడెక్ మినీ కూలర్ అనేది చిన్న రూముల్లో ఉన్నవారికి 3-ఇన్-1 సొల్యూషన్ ఇస్తుంది. అంటే ఇది గదిని చల్లగా ఉంచుతుంది. గాలిని శుభ్రపరుస్తుంది. గదిలో తేమ లేకుండా చేస్తుంది. దీనిని మీడియో సైజ్ రూమ్‌ల్లో కూడా వాడుకోవచ్చు. మార్కెట్లో ఈ మినీ కూలర్ ధర సుమారుగా రూ.999 ఉంటుంది.