Best Gadgets For Monsoon: వర్షాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షపు చినుకులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే వర్షాకాలం ఆనందాలతో పాటు రోగాలనూ వెంట తీసుకొస్తుంది. ఈ కాలంలో ఎక్కడ చూసినా తేమ ఎక్కువగా ఉండటంతో చాలా చికాకుగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మన ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మాన్సూన్ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు! అవేంటంటే?
1. Vacuum Cleaner:వర్షాకాలంలో ఎక్కడ చూసినా తడి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇంట్లో పొడి వాతావరణం ఉండాలని అంతా కోరుకుంటారు. ఈ కాలంలో ఇంటిని క్లీన్ చేయటానికి కచ్చితంగా వాక్యూమ్ క్లీనర్ అవసరం. వాక్యూమ్ క్లీనర్ కొనాలనుకునే వారికి 'Philips PowerPro' ఒక చక్కటి ఎంపిక. ఇది అమెజాన్‌లో రూ. 8,999కు లభిస్తుంది.
Philips_PowerPro_Vacuum_Cleaner (Philips) 2. Robotic Vacuum Cleaner:వర్షాకాలంలో ఏ పని చేయాలన్నా కాస్త బద్ధకంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్లకు ఇంటిని శుభ్రం చేసుకునేందుకు రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ కొనాలనుకునే వారికి 'ECOVACS Deebot U2 Pro' మంచి ఎంపిక. ఇది అమెజాన్‌లో రూ.14,900కు అందుబాటులో ఉంది. టైల్స్, కార్పెట్స్, ఉడెన్ ఫ్లోరింగ్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇది అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్లను సపోర్ట్ చేస్తుంది.
ECOVACS_Deebot_U2_Pro_Robotic_Vacuum_Cleaner (ECOVACS) 3. SHARP Electric Home Dehumidifier:వర్షాకాలంలో ముఖ్యంగా అందరూ ఎదుర్కొనే పెద్ద సమస్య దుస్తుల దుర్వాసన. బయట వర్షం పడటంతో దుస్తులు సరిగా ఆరవు. అలాంటి సమయంలో డీహ్యూమిడిఫైయర్ బాగా ఉపయోగపడుతుంది. బడ్జెట్ ధరలో క్వాలిటీతో మార్కెట్లో 'షార్ప్ ఎలక్ట్రిక్ హోమ్ డీహ్యూమిడిఫైయర్' లభిస్తుంది. దీని ధర కేవలం రూ.24,988 మాత్రమే. ఇది ఆటో-డ్రై, లాండ్రీ, ప్రీ-ఫిల్టర్ మోడ్‌లను కలిగి ఉంది.
SHARP_Electric_Home_Dehumidifier (SHARP) 4. Philips Drip Coffee Maker:వర్షం పడుతున్న సమయంలో వేడి వేడి కాఫీ ఆస్వాదిస్తుంటే ఆ ఫీల్ వేరే లెవల్. అలాంటి సందర్భాల్లో బయట దొరికే కాఫీ కంటే ఇంట్లో వేడి వేడిగా కాఫీ తయారు చేసుకుని తాగితే బాగుంటుంది. మీరు కాఫీ ప్రియులైతే వెంటనే 'ఫిలిప్స్ డ్రిప్ కాఫీ మేకర్'ను కొనుగోలు చేయండి. అమెజాన్‌లో ఇది రూ.3,116కు లభిస్తుంది. ఇది 750W మోటార్‌ను కలిగి ఉంది.
Philips_Drip_Coffee_Maker (Philips) 5. Havells Electric Kettle Aqua Plus:వర్షాకాలంలో చల్లటి నీటిని తాగటం కంటే గోరువెచ్చని నీటిని తాగటం ఉత్తమం. అలాంటి సందర్భాల్లో నీటిని మరగబెట్టేందుకు ఎలక్ట్రిక్ కెటిల్ బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో సరసమైన ధరలో ఉత్తమ క్వాలిటీతో 'హావెల్స్ ఎలక్ట్రిక్ కెటిల్ ఆక్వా ప్లస్' కెటిల్ అందుబాటులో ఉంది. వంటగదిలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా ప్రయాణాలు చేసే సమయంలో ఇది మరింత ఉపయోగపడుతుంది. దీని కెపాసిటీ 1.2 లీటర్లు.
Havells_Electric_Kettle_Aqua_Plus (Havells) 6. JBL Go 3 Water Resistant Speaker: వర్షాకాలంలో వేడివేడిగా బజ్జీలు కానీ, పకోడీ కానీ తింటూ మంచి సాంగ్స్ వింటే ఆ అనుభూతి మామూలుగా ఉండదు. అందుకోసం మంచి వైర్లెస్, వాటర్‌ఫ్రూప్ బ్లూటూత్ స్పీకర్ ఉంటే ఆ ఫీల్‌ను మరింత ఎంజాయ్ చేయగలుగుతాం. అందుకోసం తక్కువ ధరలో 'JBL Go 3' వాటర్ రెసిస్టెంట్ స్పీకర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 5గంటల వరకూ పనిచేస్తుంది.
JBL_Go_3_Water_Resistant_Speaker (JBL) మార్కెట్లో ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్- ఫస్ట్‌లుక్ మామూలుగా లేదుగా! - Tecno Phantom Ultimate 2 FIRST LOOK
శాంసంగ్ ఫోన్లపై అదిరే ఆఫర్స్- రూ.6వేల వరకు భారీ తగ్గింపు! - huge discounts on samsung phones