తెలంగాణ

telangana

ETV Bharat / technology

స్టూడెంట్స్​కు ఉపయోగపడే​ టాప్​-5 ఏఐ టూల్స్​ ఇవే! - AI Tools for Students - AI TOOLS FOR STUDENTS

Best AI Tools For Students : నేడు అనేక రకాలైన ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో విద్యార్థులకు ఉపయోగపడే టాప్​-5 ఏఐ టూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

AI Powered Tutoring Tools For Students
Top AI Tools For Students

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 3:37 PM IST

Top 5 Best AI Tools For Students :మీరు స్టూడెంట్సా?ఇప్పటికీ మీ స్టడీ ప్లాన్స్​లో పాత పద్ధతులనే ఉపయోగిస్తున్నారా? ఇలా చేస్తే మీరు మిగతా వారికంటే ఎప్పుడూ వెనుకంజలోనే ఉంటారు. టెక్నాలజీ అప్డేట్​ అవుతున్న ఈ సమయంలో మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్​ అవుతూ ఉండాలి. అందుకే ఈ ఆర్టికల్​లో మీకు ఉపయోగపడే 5 ఏఐ స్టడీ టూల్స్​ గురించి తెలియజేశాం. వీటి సాయంతో మీరు చదువులో ఎవరూ ఊహించని రీతిలో ఫలితాలు సాధించవచ్చు. మరెందుకు ఆలస్యం ఆ టాప్​-5 ఏఐ టూల్స్​ గురించి తెలుసుకుందాం రండి.

గ్రామర్లీ
Grammarly : గ్రామర్లీ అనేది ఒక ఏఐ రైటింగ్​ టూల్​​. దీనిని ఉపయోగించి విద్యార్థులు తమ రైటింగ్ స్కిల్స్​ను మెరుగుపరుచుకోవచ్చు. ఈ టూల్​ మీరు రాసిన వ్యాసంలోని వ్యాకరణ (గ్రామర్) దోషాలను గుర్తిస్తుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్​, విరామ చిహ్నాలు (పంక్చువేషన్ మార్క్స్​​)ను గుర్తించి, తప్పులను సరిదిద్దుతుంది. అంతేకాదు మీ రాతశైలిని కూడా మెరుగుపరుచుకునేందుకు సహకరిస్తుంది. కనుక విద్యార్థులు ఏఐ టూల్​ను ఉపయోగించుకుని, చాలా సులువుగా వ్యాసాలు, టెర్మ్​ పేపర్లు, అసైన్​మెంట్లు పూర్తి చేసుకోవచ్చు.

నోషన్​
Notion :నోషన్​ అనేది ఆల్​-ఇన్​-వన్​ వర్క్‌స్పేస్​ ఏఐ టూల్​. ఇది విద్యార్థులు టాస్క్‌లు, ప్రాజెక్ట్​లను ఆర్గనైజ్​ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా నోట్-టేకింగ్, టాస్క్​ మేనేజ్‌మెంట్​, ప్రాజెక్ట్​ ప్లానింగ్​లు చేసుకోవచ్చు. అంతేకాదు ఈ ప్లాట్​ఫాంలో తోటి విద్యార్థులతో కలిసి పనిచేయవచ్చు.

సింటియా
Syntea : 'ఇంటర్నేషనల్​ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్​ సైన్సెస్' విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ సింటియా ఏఐ టూల్​ను అభివృద్ధి చేసింది. ​దీనిలో ప్రధానంగా రెండు ఫీచర్లు ఉన్నాయి. అవి ఏమిటంటే?

1. మీ కోర్సు కంటెంట్‌కు సంబంధించిన ప్రశ్నలను Synteaను అడగవచ్చు. అది వెంటనే మీకు సమాధానమిస్తుంది. అలాగే ఆ సమాధానం ఏ బుక్​ సోర్స్​ నుంచి వచ్చిందో కూడా మీకు తెలియజేస్తుంది.

2. దీనిలో ప్రీ అసైన్​మెంట్ ఫీచర్​ కూడా ఉంది. దీనిని ఉపయోగించి మీ నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్ ఎగ్జామ్స్​ రాసేముందు, దీనిలో ప్రాక్టీస్​ టెస్ట్​లు రాసి, మీ లోపాలను సరిదిద్దుకోవచ్చు.

గ్రేడ్​స్కోప్​
Gradescope :ఈ గ్రేడ్​స్కోప్​ ఏఐ టూల్​ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇద్దరికీ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఉపాధ్యాయులు రియల్​ టైమ్​లో మల్టిపుల్​ ఛాయిస్​ క్వశ్చన్స్​, ఖాళీల పూరణ, కోడింగ్​ ప్రశ్నలను విద్యార్థులను అడగవచ్చు. వారు కూడా ఇదే వేదికగా సమాధానాలు ఇవ్వవచ్చు. ఫలితాలను కూడా అదే సమయంలో తెలుసుకోవచ్చు. ఈ విధంగా గ్రేడ్​స్కోప్ టూల్​ ద్వారా మీ సెమిస్టర్ ప్రోగ్రస్​ను ట్రాక్ చేసుకోవచ్చు.

చాట్​ జీపీటీ
Chat-GPT : చాట్​ జీపీటీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ గేమ్​ ఛేంజింగ్​ వెబ్​ అప్లికేషన్​ కేవలం విద్యార్థుల కోసం మాత్రమే కాకుండా అందరికీ ఓ ఉత్తమమైన ఏఐ టూల్​గా పనిచేస్తుంది. ఈ AI ఆధారిత చాట్‌బాట్‌ను ఓపెన్​ AI అభివృద్ధి చేసింది. ఇది మానవుల అడిగే అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. కనుక విద్యార్థులు తమకు తెలియని సంక్లిష్టమైన ప్రశ్నలకు చాట్​-జీపీటీ ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు చాట్​-జీపీటీతో ఇంటరాక్టివ్​ సెషన్​లో కూడా పాల్గొనవచ్చు.

నోకియా 3210 మళ్లీ వస్తోందా? ఆసక్తి రేపుతున్న HMD టీజర్! - Nokia 3210 smartphone

కొత్త ఫోన్ కొనాలా? టాప్​-5 అప్​కమింగ్ మొబైల్స్ ఇవే - ధర ఎంతంటే? - Upcoming Smartphones 2024

ABOUT THE AUTHOR

...view details