Audi Q7 Facelift Launched:లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో 'ఆడి క్యూ7' కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది కంపెనీ ప్రస్తుత జనరేషన్లో ఇది రెండో ఫేస్‌లిఫ్ట్. ఆడి.. కొద్ది రోజుల క్రితమే దీని బుకింగ్స్ ప్రారంభించింది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ఎక్స్టీరియర్:ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ జనవరి 2024లో గ్లోబల్‌గా పరిచయం చేశారు. దీన్ని అప్డేట్ చేసి, ముఖ్యంగా కాస్మెటిక్ మార్పులు చేసి ఇప్పుడు లాంఛ్ చేశారు. Q6 e-Tron వంటి కస్టమైజబుల్ లైట్ సిగ్నేచర్‌తో కొత్త OLED హెడ్‌ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి. ఈ కారు థిక్ క్రోమ్ సరౌండ్ అండ్ హెక్సాగోనల్ ప్యాటెర్న్తో కొత్త గ్రిల్, Q8 SUV మాదిరిగానే రీడిజైన్డ్ బంపర్లను కలిగి ఉంది.
కలర్ ఆప్షన్స్: ఈ అప్డేటెడ్ వెర్షన్ కారు ఐదు ఎక్స్టీరియర్ కలర్స్‌తో వస్తుంది.
- సఖిర్ గోల్డ్
- వైటోమో బ్లూ
- మైథోస్ బ్లాక్
- సమురాయ్ గ్రే
- గ్లేసియర్ వైట్
ఇంటీరియర్: ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగంలో పరిశీలిస్తే.. ఇందులో సెడార్ బ్రౌన్, సైగా బీజ్ వంటి రెండు అప్హోల్స్టరీ షేడ్స్ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అప్‌గ్రేడ్ చేసినప్పటికీ దీని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్లో ఎటువంటి మార్పు లేదు. ఈ కారు లేన్-ఛేంజ్ వార్నింగ్ సిస్టమ్‌తో అప్డేటెడ్ వర్చువల్ కాక్‌పిట్‌తో వస్తుంది. ఇది కాకుండా ఇందులో వైర్డు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కూడా అందుబాటులో ఉన్నాయి.