తెలంగాణ

telangana

ETV Bharat / technology

స్పోర్టీ లుక్​లో ఏప్రిలియా కొత్త బైక్ భలే ఉందిగా!- ఫీచర్లు కూడా అదుర్స్! - APRILIA TUONO 457 DESIGN PATENT

త్వరలో మార్కెట్​లోకి ఏప్రిలియా టువోనో 457- ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

Aprilia Tuono 457
Aprilia Tuono 457 (Photo Credit- Aprilia)

By ETV Bharat Tech Team

Published : Feb 10, 2025, 5:12 PM IST

Aprilia Tuono 457 Design Patent:ఇటాలియన్ బైక్ తయారీ సంస్థ ఏప్రిలియా తన కొత్త 'ఏప్రిలియా టువోనో 457' బైక్​ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఈ మోటార్​సైకిల్​ను 2025 ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీన దీని ధరలను ప్రకటిస్తామని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో దాని అధికారిక లాంఛ్​కు ముందుగా కంపెనీ మోటార్​సైకిల్ డిజైన్ పేటెంట్​ను దాఖలు చేసింది. 'టువోనో 457' మొదటిసారిగా EICMA 2024లో ఫుల్లీ-ఫైర్డ్ RS 457 నేక్డ్ వెర్షన్‌గా ఆవిష్కరించారు. ఇది 2023లో దేశీయ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చింది.

కంపెనీ ఈ 'టువోనో 457' బైక్​ను 'RS 457' మోటార్​సైకిల్ ఆధారంగా అప్​డేట్​ చేసి తీసుకొస్తోంది. ఇది 'RS 457' మాదిరిగానే ఇంజిన్ అండ్ మెకానికల్ భాగాలను కలిగి ఉంటుంది. అయితే దీన్ని 'RS 457' నేక్డ్ వెర్షన్‌గా తీసుకొస్తున్నారు. ఇది ఇంటిగ్రేటెడ్ LED DRLలతో కూడిన కాంపాక్ట్ బగ్ లాంటి హెడ్‌ల్యాంప్ యూనిట్‌ను కలిగి ఉంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ కూడా 'RS 457' మాదిరిగానే ఉంటుంది. కానీ ఫుల్ ఫెయిరింగ్స్​కు బదులుగా 'టువోనో 457' స్పోర్ట్స్ అగ్రెసివ్ రేడియేటర్ ష్రూడ్స్​ను కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ పిరాన్హా రెడ్, ప్యూమా గ్రే అనే రెండు కలర్ స్కీమ్‌లలో వస్తుంది.

Aprilia Tuono 457 (Photo Credit- Aprilia)

'టువోనో 457' ముందు భాగంలో ప్రీలోడ్-అడ్జస్టబుల్ USD ఫోర్క్, వెనకవైపు ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్​ను కలిగి ఉంటుంది. డిస్క్ బ్రేక్‌లు రెండు చివర్లలో స్టాపింగ్ డ్యూటీలను నిర్వహిస్తాయి. ఇక టెక్నాలజీ పరంగా చూస్తే ఈ మోటార్‌సైకిల్ 5.0-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే, అప్రిలియా రైడ్-బై-వైర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అదనంగా ఇది మూడు రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ABSతో సహా ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్​ను కలిగి ఉంది.

Aprilia Tuono 457 (Photo Credit- Aprilia)

ఇక పవర్​ట్రెయిన్​ విషయానికొస్తే ఇందులో దాని ఫుల్-ఫెయిర్డ్ సిబ్లింగ్ బైక్స్​లో ఉన్న అదే 457cc సమాంతర-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47bhp పవర్, 43.5Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది ఆప్షనల్ బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు స్లిప్పర్ క్లచ్‌ను కలిగి ఉంటుంది. అయితే కంపెనీ ఈ కొత్త మోటార్​సైకిల్​ను 'RS 457' కంటే కొంచెం తక్కువ ధరలోనే లాంఛ్ చేయొచ్చని తెలుస్తోంది. ఇకపోతే కంపెనీ 'RS 457' బైక్​ను ప్రస్తుతం రూ. 4.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయిస్తోంది. అంటే రాబోయే ఈ టువోనో 457 బైక్ ధర రూ. 4.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) కంటే కాస్త తక్కువగా ఉండొచ్చు.

గ్లోబల్​ మార్కెట్​ను షేక్ చేసేందుకు రెడీగా ఒప్పో!- అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్​తో వచ్చేస్తోందిగా!

సునీతా రాకపై సర్వత్రా ఉత్కంఠ- షెడ్యూల్ కంటే ముందుగానే భూమికి!- ఎలాగంటే?

శాంసంగ్ గెలాక్సీ S25 క్రేజ్ చూశారా?- ఏకంగా 4.30 లక్షల ప్రీ-బుకింగ్స్​తో రికార్డ్!

ABOUT THE AUTHOR

...view details