తెలంగాణ

telangana

ETV Bharat / technology

'సిరి' ఇక సూపర్ స్మార్ట్- iOS18లో అదిరే ఫీచర్స్- పూర్తి వివరాలు తెలిసేది ఆరోజే! - Apple WWDC Event 2024 - APPLE WWDC EVENT 2024

Apple WWDC Event : దిగ్గజ ఎలక్ట్రానిక్స్​ కంపెనీ యాపిల్‌ ఏటా నిర్వహించే వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ తేదీలను తాజాగా ప్రకటించింది. జూన్​ 10 నుంచి 14 వరకు ఈ ఈవెంట్​ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో జనరేటివ్ ఏఐ నుంచి ఐఓఎస్​ 18 వరకు అనేక ఆవిష్కరణల గురించి ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మీ కోసం.

Apple Event WWDC 2024
Apple WWDC Event

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 5:20 PM IST

Updated : Mar 27, 2024, 5:25 PM IST

Apple WWDC Event :అమెరికాకు చెందినప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ ఈ 2024లో సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి సిద్ధమైంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యాపిల్‌ 'వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌' (WWDC) తేదీలను ప్రకటించింది. యాపిల్​ కంపెనీ ఏటా తాము తీసుకురానున్న సరికొత్త సాఫ్ట్‌వేర్‌ ఫీచర్లు, ఉత్పత్తుల గురించి యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా WWDC 2024ను వర్చువల్​గా జూన్‌ 10 నుంచి జూన్‌14 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఏఐ టెక్నాలజీ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏఐ హవా నడుస్తోంది. ఈ తరుణంలో యాపిల్‌ కంపెనీ తీసుకురానున్న సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్లను కచ్చితంగా జోడించే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. క్లౌడ్ ఆధారిత జెన్‌ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు గూగుల్‌ కృషి చేయవచ్చని తెలుస్తోంది. ఇక ఐఓఎస్​ 18, ఐపాడ్​ఓఎస్​ 18, మ్యాక్​ఓఎస్ 15, వాచ్​ఓఎస్​ 11, టీవీఓఎస్ 18 అనే కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (OS) వివరాలను కూడా యాపిల్​ పరిచయం చేయనుందని సమాచారం వస్తోంది. వీటితోపాటు యాపిల్ కంపెనీ ఐపాడ్‌ ఎయిర్‌, ఓఎల్‌ఈడీ ఐపాడ్‌ ప్రోలో కొత్త మోడల్స్‌ను కూడా లాంఛ్​ చేసే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Apple iOS 18 Update :యాపిల్ కంపెనీ ఈ ఏడాది ఐఓఎస్​ 18 అప్​డేట్​ను రిలీజ్ చేయనుంది. దీనిలో ఏఐ-పవర్డ్ సిరి, యాప్​ సైడ్ లోడింగ్​, థర్డ్ పార్టీ పేమెంట్ గేట్​వే, పవర్​ఫుల్ వెబ్​బ్రౌజర్స్​, ​ఆర్​సీఎస్ ప్రోటోకాల్ సపోర్ట్ లాంటి బోలెడు మంచి ఫీచర్లు ఉన్నాయని సమాచారం. అలాగే యాపిల్​ త్వరలో తన సరికొత్త ఐఫోన్ 16ను కూడా లాంఛ్ చేసే అవకాశం ఉంది.

నేరుగా చూడాలనుకుంటున్నారా?
యాపిల్‌ ఈ WWDC కాన్ఫరెన్స్​ను ఆన్‌లైన్​లో నిర్వహించనుంది. అయినప్పటికీ ఈ కాన్ఫరెన్స్​కు మొదటి రోజు వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంది. కనుక ఆసక్తి ఉన్న వాళ్లు నేరుగా యాపిల్‌ డెవలపర్‌ యాప్‌, కంపెనీ వెబ్‌సైట్​ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యాపిల్‌ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

గుడ్​ న్యూస్​ - 'X' ప్రీమియం యూజర్లకు​ త్వరలోనే 'గ్రోక్'​ ఏఐ యాక్సెస్​! - Grok AI For All X Premium Users

స్టూడెంట్స్​కు ఉపయోగపడే​ టాప్​-5 ఏఐ టూల్స్​ ఇవే! - AI Tools for Students

Last Updated : Mar 27, 2024, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details