తెలంగాణ

telangana

ETV Bharat / technology

యాపిల్ దీపావళి సేల్ వచ్చేసిందోచ్- ఐఫోన్ ప్రియులకు ఇక ఆఫర్ల పండగే..! - Apple Diwali Sale Starts - APPLE DIWALI SALE STARTS

Apple Diwali Sale Starts: యాపిల్‌ లవర్స్​కు సూపర్ గుడ్​న్యూస్ వచ్చింది. యాపిల్‌ దీపావళి సేల్​లో ఐఫోన్లతో పాటు కంపెనీ ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు తీసుకొచ్చింది. ఎంపిక చేసిన వస్తువుల సేల్స్​పై 3 నెలల పాటు యాపిల్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీగా ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాక ఐఫోన్‌ 15 కొనుగోలు చేసినవారికి ఉచితంగా బీట్స్‌ సోలో బడ్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

apple diwali sale 2024
apple diwali sale 2024 (Apple)

By ETV Bharat Tech Team

Published : Oct 3, 2024, 2:44 PM IST

Apple Diwali Sale Starts: ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో దీపావళి సేల్‌ను ప్రారంభించింది. ప్రత్యేక డిస్కౌంట్లు, బ్యాంక్‌ ఆఫర్లతో ఈ డీల్‌ తీసుకొచ్చింది. ఐఫోన్లతో పాటు మ్యాక్‌బుక్‌, ఐప్యాడ్ వంటి పలురకాల యాపిల్‌ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోంది. అంతేకాక ఐఫోన్‌ 15 కొనుగోలు చేసినవారికి ఉచితంగా బీట్స్‌ సోలో బడ్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఈ దీపావళి సేల్‌లో ఎంపికచేసిన బ్యాంక్ కార్డులపై రూ.10వేల వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు యాపిల్ తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులు ఉన్నవారు మాత్రమే ఈ ప్రయోజనాలు పొందొచ్చు. ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌తో పాటు కార్డ్‌ హోల్టర్లకు 12 నెలల పాటు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా అందించింది. ఇక ఐఫోన్ 16సిరీస్ ఫోన్లపై రూ.5వేలు, మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం3, మ్యాక్‌బుక్‌ ప్రో పై 10వేల రూపాయల వరకు రాయితీ అందిస్తోంది.

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం2పై రూ.8వేలు వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఐఫోన్‌ 15 కొనుగోలు చేసేవారికి బీట్స్‌ సోలో బడ్స్‌ ఫ్రీ ఇస్తోంది. అయితే ఈ ఆఫర్‌ అక్టోబర్‌4 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని యాపిల్ స్పష్టం చేసింది. ఐప్యాడ్‌, యాపిల్‌ వాచ్‌లపై రూ.6వేలు వరకు క్యాష్‌బ్యాక్‌ ప్రకటించింది. ఎయిర్‌పాడ్‌లపై రూ.4వేలు వరకు ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఎక్స్ఛేంజీ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఎంపిక చేసిన వస్తువుల కొనుగోళ్లపై 3 నెలల పాటు యాపిల్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీగా ఇస్తున్నట్లు తెలిపింది.

యాపిల్ లవర్స్​కు సూపర్ అప్​డేట్- త్వరలో తక్కువ ధర ఐఫోన్..! - IPHONE SE

యాపిల్‌ ఇంటెలిజెన్స్​తో ఐఫోన్ 16 సిరీస్​- ధర, ఫీచర్లు ఇవే! - iphone 16 Series Mobiles Launched

ABOUT THE AUTHOR

...view details