తెలంగాణ

telangana

స్టన్నింగ్ ఫీచర్స్​తో త్వరలో బైక్స్ & స్కూటర్స్ లాంచ్- ఫస్ట్​ లుక్​ చూశారా? - Upcoming Bikes and Scooters

By ETV Bharat Tech Team

Published : Sep 3, 2024, 11:10 AM IST

Updated : Sep 3, 2024, 1:22 PM IST

Upcoming Bikes and Scooters in India: మీరు కొత్త బైక్ కొనాలని అనుకుంటున్నారా? లేటెస్ట్ ఫీచర్స్​, స్పెక్స్​ సహా డిజైన్ అదిరిపోవాలా? అంతేకాదు ఆ బైక్​ మంచి మైలేజ్ కూడా ఇవ్వాలా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. అతి త్వరలో భారత్​లో లాంచ్​ కానున్న టాప్​-5 టూ-వీలర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Upcoming_Bikes_and_Scooters_in_India
Upcoming_Bikes_and_Scooters_in_India (Jawa, Hero, Bajaj, BMW)

Upcoming Bikes and Scooters in India: ప్రస్తుతం మార్కెట్లో బైక్స్, స్టూటర్స్​కు మంచి క్రేజ్ ఉంది. రయ్​ రయ్​ మంటూ టూ-వీలర్స్​పై దూసుకుపోవటం అంటే యువతకు భలే సరదా. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ వెర్షన్స్​ను రిలీజ్ చేస్తుంటాయి. కస్టమర్ల ఆసక్తి, అభిరుచికి తగినట్లుగా ఆకర్షణీయమైన లుక్​లో వాటిని రూపొందిస్తున్నాయి. తాజాగా ఈ సెప్టెంబర్​లో పలు ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థలు తమ లేటెస్ట్​ బ్రాండెడ్ బైక్స్ అండ్ స్కూటర్స్​ను లాంఛ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిలోని టాప్​-5 బైక్స్ అండ్ స్కూటీస్​పై ఓ లుక్కేద్దాం రండి.

ఈ సెప్టెంబర్​లో మార్కెట్లో రిలీజ్ కానున్న టాప్ బైక్స్ అండ్ స్కూటర్స్ ఇవే:

  • జావా 42
  • హీరో డెస్టినీ 125
  • బజాజ్ ఇథనాల్ బైక్
  • బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్900 జిఎస్
  • బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్900 జిఎస్ అడ్వెంచర్

Jawa 42: జావా మోటార్​సైకిల్స్ తన లేటెస్ట్ వెర్షన్ 'జావా 42న' బైక్​ను నేడు రిలీజ్ చేసేందుకు సిద్ధమయింది. లేటెస్ట్ ఫీచర్స్​, స్టన్నింగ్​ లుక్స్​లో దీన్ని డిజైన్ చేశారు. దీని ధర రూ. 2 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని అంచనా.

Jawa_42 (Jawa)

Hero Destini 125:హీరో మోటోకార్ప్ తన పాత మోడల్​కు మార్పులు, చేర్పులు చేస్తూ లేటెస్ట్ వెర్షన్ ' హీరో డెస్టినీ 125' స్కూటర్​ను సెప్టెంబర్ 7న భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. కొంగొత్త రంగులు, మెరుగైన ఫీచర్లు, ఇంజిన్ మార్పులతో దీన్ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది 124.6సీసీ ఇంజిన్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

Hero_Destini_125 (Hero)

Bajaj Ethanol Bike: బజాజ్ ఆటో పర్యవరణానికి అనుకూలంగా తన మొదటి ఇథనాల్​తో నడిచే బైక్​ను లాంచ్ చేసేందుకు సన్నాహాల చేస్తోంది. దీని పాత వెర్షన్లో ఇంజిన్​లో మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. బజాజ్ ఆటో ఈ బైక్​ను ఈ సెప్టెంబర్​లో లాంచ్ చేస్తారని అంచనా.

Bajaj_Ethanol_Bike (Bajaj Ethanol Bike)

BMW F900 GS: బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ 'F900 GS', 'F900 GS అడ్వెంచర్' బైక్​లను ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. F850 GS మోడల్​లో మార్పులు చేస్తూ అప్‌డేటెడ్ బాడీవర్క్, ఇంజిన్​లను కలిగి ఉన్నాయి. వీటికి ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించగా.. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

BMW_F900_GS (BMW F900 GS)

BMW F900 GS Adventure: టూరింగ్ ఔత్సాహికుల కోసం F900 GS అడ్వెంచర్ బైక్​ను రూపొందించారు. ఈ వెర్షన్​ బైక్స్​లో ఆఫ్​-రోడ్ టైర్స్, 23-లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, మెరుగైన సస్పెన్స్ ఉన్నాయి. 'F900 GS', 'F900 GS అడ్వెంచర్' రెండూ రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభమవుతాయని అంచనా.

BMW_F900_GS_Adventure (BMW F900 GS Adventure)

'రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350' లాంచ్- ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! - Royal Enfield Classic 350 Launch

మతిచెదిరే ఫీచర్లతో 'టాటా మోటార్స్ కర్వ్ ఐస్' లాంచ్- ధర ఎంతంటే? - Tata Curvv ICE Version Launch

Last Updated : Sep 3, 2024, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details