2025 Triumph Tiger 1200:దీపావళి వేళ ఇండియన్ మార్కెట్లోకి ఓ ఖరీదైన బైక్ వచ్చింది. ప్రీమియం బైక్స్ తయారీ సంస్థ ట్రయంఫ్ తన ఖరీదైన '2025 టైగర్ 1200' మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసింది. దీని ప్రీవియస్ మోడల్స్‌ను అప్డేట్ చేస్తూ అదిరే ఫీచర్లతో మతిచెదిరే డిజైన్‌లో దీన్ని తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
వేరియంట్స్: కంపెనీ ఈ బైక్‌ను నాలుగు వేరియంట్స్‌లో తీసుకొచ్చింది.
- GT ప్రో
- GT ప్రో ఎక్స్‌ప్లోరర్
- ర్యాలీ ప్రో
- ర్యాలీ ప్రో ఎక్స్‌ప్లోరర్
టైగర్ 1200 GT ప్రో వేరియంట్ 19-18 అంగుళాల అల్లాయ్ వీల్ కాంబినేషన్లో మరింత రోడ్ బియాస్డ్గా ఉంటుంది. అయితే ర్యాలీ ప్రో ఎడిషన్‌ను 21-18 అంగుళాల ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో ఆఫ్ రోడ్ ఫోకస్‌తో రూపొందించారు. ఈ రెండు మోడళ్ల ఎక్స్‌ప్లోరర్ ట్రిమ్స్ 30-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, ప్రో వేరియంట్స్ 20-లీటర్ ట్యాంక్‌తో వస్తున్నాయి.
ఇంజిన్: ఈ బైక్ T-ప్లేస్ క్రాంక్‌తో 1,160cc, ఇన్‌లైన్ త్రీ-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది బెటర్ లో-ఎండ్ ట్రాక్బిలిటీ, రెస్పాన్సివ్నెస్ను ఇస్తుంది. క్రాంక్ షాఫ్ట్, ఆల్టర్నేటర్ రోటర్, బ్యాలెన్సర్‌లో మార్పులు చేసి దీన్ని రూపొందించారు. దీని ఇంజిన్ 9,000rpm వద్ద 150bhp పవర్, 7,000rpm వద్ద 130Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాక ఇందులో సున్నితమైన గేర్ షిఫ్ట్‌లను అందించేందుకు క్లచ్ కూడా సర్దుబాటు చేశారు.
రైడింగ్ కంఫర్ట్:వినియోగదారులకు మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు కంపెనీ ఈ బైక్‌లో కొన్ని మార్పులు చేసింది. దీని సీట్ ప్రొఫైల్ పాత వాటి కంటే ఫ్లాట్‌గా ఉంటుంది. ఎక్స్‌ప్లోరర్ ట్రిమ్స్ నుంచి డంప్డ్ హ్యాండిల్‌బార్స్, రైసర్స్ ప్రో మోడల్‌కు ఇచ్చింది. అయితే క్లచ్ లివర్‌ను కొద్దిగా పొడుగ్గా మార్చింది. ఈ బైక్‌లో రైడర్స్ కావాలంటే యాక్సెసరీ లో-సీట్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇది శాడిల్ ఎత్తును 20 మిమీ తగ్గిస్తుంది.