Bajaj Pulsar RS200:దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తన కొత్త పల్సర్ RS200 బైక్‌ను రిలీజ్ చేసింది. ఈ బైక్ దీని పాత వెర్షన్ కంటే మరింత మెరుగ్గా ఉంది. ఇందులో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ డిజైన్‌ను కంపెనీ కొంగొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ముఖ్యంగా యూత్‌ను ఎంట్రాక్ట్ చేసేలా స్పోర్టివ్ డిజైన్‌తో స్టన్నింగ్ లుక్‌లో దీన్ని రూపొందించింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.
కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ బైక్‌ను మూడు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది.
- గ్లోసీ రేసింగ్ రెడ్
- పెర్ల్ మెటాలిక్ వైట్
- యాక్టివ్ శాటిన్ బ్లాక్
ఇంజిన్ అండ్ పవర్: ఈ కొత్త బజాజ్ పల్సర్ RS200 బైక్‌లో 200cc, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ సింగిల్-స్పార్క్, 4-వాల్వ్ 199.5cc ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది 24.5 PS పవర్, 18.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది దాని సెగ్మెంట్లో అత్యుత్తమ ఇంజిన్. ఈ ఇంజిన్ అన్ని వాతావరణ పరిస్థితులలోనూ బాగా పనిచేస్తుంది. పవర్, పనితీరు పరంగా ఈ ఇంజిన్ చాలా పవర్ఫుల్. గుడ్ పెర్ఫార్మెన్స్తో మంచి బైక్ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
డిజైన్ అండ్ ఫీచర్స్:ఈ నయా బజాజ్ పల్సర్ RS200 డిజైన్ పరంగా చాలా బోల్డ్‌గా ఉంటుంది. ఇది షార్ప్ అండ్ అగ్రెసివ్ లుక్‌లో కన్పిస్తుంది. ఇది ఫెయిరింగ్, బోల్డ్ ఫ్రంట్ ప్రొఫైల్, కొత్త LED టెయిల్ లాంప్స్, బోల్డ్ నేకెడ్ రియర్ సెక్షన్‌ను కలిగి ఉంది.
ఈ బైక్ కొత్త వెడల్పాటి టైర్లు (140/70-17 రియర్, 110/70-17 ఫ్రంట్), కస్టమైజబుల్ రైడ్ మోడ్‌లను (రోడ్, రెయిన్, ఆఫ్‌రోడ్) లను కలిగి ఉంది. ఈ టైర్లు అన్ని రకాల రోడ్లపై బాగా నడుస్తాయి. మెరుగైన భద్రత కోసం బైక్‌లో డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.
ఈ బైక్‌లో LCD డిస్‌ప్లే, బ్లూటూత్-ఎనేబుల్డ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అండ్ SMS అలర్ట్స్తో పాటు గేర్ ఇండికేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక ఇందులో అధునాతన LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, డేటైమ్ LED ఫీచర్లను కూడా చూడొచ్చు.