Royal Enfield Classic 350 2024 Launch:ఇండియన్ మార్కెట్లోకి డుగ్ డుగ్ బుల్లెట్ బండి వచ్చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో కొత్త మోడల్ 'రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350' బైక్‌ను ఇవాళ రిలీజ్ చేసింది. దీని పాత మోడల్‌కు కొంగొత్త రంగులను అద్ది అదిరే ఫీచర్స్‌తో దీన్ని రూపొందించారు. నేటి నుంచి ఈ బైక్ బుకింగ్స్, టెస్ట్‌రైడ్స్ ప్రారంభం కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. సెప్టెంబర్ 4 వరకు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు చెన్నై విజిటింగ్ ఆఫర్ కల్పించింది.
Royal Enfield Classic 350 Features:
- ఇంజిన్ కెపాసిటీ: 349 సీసీ
- మైలేజ్:35 కి.మీ/ లీటర్
- ట్రాన్స్మిషన్:5 స్పీడ్ మాన్యూయెల్
- కెర్బ్ వెయిట్:195 కేజీలు
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ: 13 లీటర్లు
- సీట్ హైట్: 805 ఎంఎం
- ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్
- ఎల్ఈడీ పైలట్ ల్యాంప్
- లెజెండరీ టియల్డ్రాప్ ట్యాంక్
- క్లస్టర్‌పై గేర్ పొజిషన్ ఇండికేటర్
- టైప్-సీ యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్
- ఎల్ఈడీ పైలట్ ల్యాంప్
- లెజెండరీ టియల్డ్రాప్ ట్యాంక్
- క్లస్టర్‌పై గేర్ పొజిషన్ ఇండికేటర్
- టైప్-సీ యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్
కలర్ ఆప్షన్స్:
- ఎమరాల్డ్
- జోధ్‌పూర్ బ్లూ
- కమాండో శాండ్
- మద్రాస్ రెడ్
- మెడలియన్ బ్రాంజ్
- సాండ్ గ్రే
- స్టెల్త్ బ్లాక్
Royal Enfield Classic 350 Variants:
- క్లాసిక్ 350 హెరిటేజ్
- క్లాసిక్ 350 హెరిటేజ్ ప్రీమియం
- క్లాసిక్ 350 సిగ్నల్స్
- క్లాసిక్ 350 డార్క్
వేరియంట్స్ కలర్ ఆప్షన్స్:
- 1. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 హెరిటేజ్ వేరియంట్‌లో మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ అనే 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.
- 2. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 హెరిటేజ్ ప్రీమియం మెడాలియన్ బ్రాంజ్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది.
- 3. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సిగ్నల్స్ వేరియంట్ కమాండో శాండ్‌లో లభిస్తుంది.
- 4. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 డార్క్ వేరియంట్ గన్ గ్రే (గ్రే, బ్లాక్ కలర్ డ్యూయల్ టోన్ స్కీమ్‌తో కాపర్ హైలైట్), స్టెల్త్ బ్లాక్ (బ్లాక్ ఆన్ బ్లాక్ స్కీమ్) కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది.
- 5. రాయల్ ఎన్‌ఫీల్డ్ అల్లాయ్ వీల్స్‌ను స్టీల్త్ బ్లాక్ కలర్‌తో మాత్రమే అందిస్తోంది.
Royal Enfield Classic 350 Specifications:
- క్లాసిక్ 350 హెరిటేజ్: డిస్క్ బ్రేక్స్, స్పోక్ వీల్స్
- క్లాసిక్ 350 హెరిటేజ్ ప్రీమియం: డిస్క్ బ్రేక్స్, స్పోక్ వీల్స్
- క్లాసిక్ 350 సిగ్నల్స్: డిస్క్ బ్రేక్స్, స్పోక్ వీల్స్
- క్లాసిక్ 350 డార్క్: డిస్క్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్
Royal Enfield Classic 350 Price:
- క్లాసిక్ 350 హెరిటేజ్ ధర: రూ.1,99,500
- క్లాసిక్ 350 హెరిటేజ్ ప్రీమియం ధర: రూ. 2,04,000
- క్లాసిక్ 350 సిగ్నల్స్ ధర: రూ. 2,16,000
- క్లాసిక్ 350 డార్క్ ధర: రూ. 2,25,000