తెలంగాణ

telangana

ETV Bharat / state

రైలొచ్చిందా ఆగిపోవాల్సిందే! - అరగంట పాటు పడిగాపులు కాయాల్సిందే - Zaheerabad Railway Over Bridge - ZAHEERABAD RAILWAY OVER BRIDGE

Zaheerabad Railway Over Bridge :రైలొచ్చిందా! ఆగిపోవాల్సిందే! 15 నుంచి 20 నిమిషాల పాటు పడిగాపులు కాయాల్సిందే! ఇది జహీరాబాద్‌ వాసుల కష్టాలు..! ఐదేళ్ల క్రితం ప్రారంభమైన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.

Zaheerabad Railway Over Bridge
Zaheerabad Railway Over Bridge Works Stopped

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 2:50 PM IST

నత్తనడకన సాగుతున్న జహీరాబాద్​ బ్రిడ్జి పనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనాదారులు

Zaheerabad Railway Over Bridge Works Stopped :జహీరాబాద్‌ పట్టణంలోని రైల్వేగేటు వద్ద రూ.90 కోట్లతో రెండు వరుసలతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులకు 2018 ఆగస్టు 30న ఎంపీ బీబీ పాటిల్‌, అప్పటి ఎమ్మెల్సీ మహ్మద్‌ పరీదుద్దీన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. వికారాబాద్‌-పర్లివైజ్యనాథ్‌ రైలు మార్గం జహీరాబాద్‌ పట్టణం మీదుగా వెళుతుంది. సికింద్రాబాద్‌, నాందేడ్‌, పూర్ణ, షిర్డీ, బెంగుళూరు, తిరుపతి, కాకినాడ రైళ్లు రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతిసారి గేటు పడటంతో వాహనదారులకు కష్టాలు తప్పడంలేదు.

జహీరాబాద్‌ ప్రధాన రహదారిపై రైల్వేగేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నప్పటికీ ముగింపు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనులు ప్రారంభించి ఐదేళ్లవుతున్నా గుత్తేదారులు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఉపరితల వారధి అందుబాటులోకి రావడం లేదు. సుమారు కిలోమీటరు పొడువున నిర్మిస్తున్న వంతెన అసంపూర్తి పనుల వల్ల ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం బిల్లుల బకాయిలు చెల్లింకపోవడంతో గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశారనే ఆరోపణలున్నాయి. వాహనదారులకు పలు మార్లు రో‌డ్డు ప్రమాదాలు జరిగినట్లు చెబుతున్నారు.

నిధులు విడుదలైనా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జాప్యం - ఇబ్బందులు పడుతున్న స్థానికులు - ROb works in peddapalli

బిల్లుల చెల్లింపుల జాప్యంతో ఆగిన పనులు : గుత్తేదారులు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో కొన్నాళ్లుగా పనులు నెమ్మదించాయి. నిర్మాణ పనులు తుది దశలో ఉన్న సమయంలో బిల్లుల చెల్లింపులు సరిగ్గా చేయకపోవడంతో పనులను నిలిపివేశారు. ఇరువైపులా రోడ్డు అనుసంధానం చేసి వంతెన రెయిలింగ్‌ పూర్తి చేసి రంగులు వేస్తే ప్రారంభానికి సిద్ధమవుతుంది. మళ్లీ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నాలుగు వరుసల ఉపరితన వంతెన నిర్మాణం పూర్తయితే రాకపోకలు సులభం కానున్నాయి. జహీరాబాద్‌ పట్టణం మీదుగా అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే చించోళి, గుల్బర్గా, బసవకళ్యాణ్‌, బీదర్‌, ప్రయాణికులకు సౌకర్యంగా మారనుంది. పట్టణ శివారులోని డ్రీమ్‌ ఇండియా, బందేఆలీ, బాబూమోహన్‌ కాలనీలతో పాటు మహీంద్రా, ఎంజీ, ముంగి, బూచినెల్లి పారిశ్రామిక వాడలు సహా మెుగుడంపల్లి, జహీరాబాద్‌ మండలంలోని పలు గ్రామాలకు ప్రజలకు గేటు కష్టాలు పూర్తిగా తీరనున్నాయి.

No Funds for Railway Over Bridge in Adilabad : పరిహారం లేదు.. ఉపాధీ పాయే.. ఆందోళనలో రైల్వే ఓవర్​ బ్రిడ్జ్​ నిర్వాసితులు

Nizamabad: మాధవనగర్​ రైల్వే ఓవర్​ బ్రిడ్జి పనులు వేగవంతం.. ఇంకా కొన్ని రోజుల్లోనే..!

ABOUT THE AUTHOR

...view details