ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు చెరువును కబ్జా చేసిన వైఎస్సార్సీపీ నాయకులు - చోద్యం చూస్తున్న అధికారులు - YSRCP Leaders Occupied Nellore Pond

YSRCP Leaders Occupied Nellore Pond : గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరు చెరువు కబ్జా చేశారు. కాలువలు ఆక్రమించి బహుళ అంతస్తు భవనాలు నిర్మించారు. వారి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన కార్పొరేషన్​ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

YSRCP LEADERS OCCUPIED NELLORE POND
YSRCP LEADERS OCCUPIED NELLORE POND (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2024, 12:06 PM IST

YSRCP Leaders Occupied Nellore Pond :నెల్లూరు చెరువు గత ఐదేళ్లుగా యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతోంది. వీటిలో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు. ఇరిగేషన్ కాలువలు సైతం ఆక్రమించి బహుళ అంతస్తు భవనాలు కట్టారు. ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చెరువును కబ్జా చేసిన వైఎస్సార్సీపీ నాయకులు :నెల్లూరు నగరంలో పెన్నా నది ఒక వైపు ఉంటే మరో వైపు 10 కిలోమీటర్ల పొడవున చెరువు విస్తరించి ఉంది. వందేళ్ల క్రితం సింహపురిలో నీటి సమస్య రాకుండా చెరువును నిర్మించారు. నెల్లూరు కార్పొరేషన్‌లో స్థలాల విలువ పెరగడంతో 3,500 ఎకరాల్లో ఉన్న చెరువు కాస్త ఆక్రమణలకు గురైంది. దాదాపు 900 ఎకరాలు ఆక్రమించినట్లు అధికారులు సర్వేలో గుర్తించారు.

గిరిజనుల భూమిపై వైఎస్సార్సీపీ దందా - ప్రశ్నించినందుకు రెండేళ్లుగా గ్రామ బహిష్కరణ - tribal land occupy ysrcp leader

బహుళ అంతస్తు భవనాలు నిర్మాణం :గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ నాయకులే కబ్జాలు చేసి ఇళ్లు నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. లేక్యూ కాలనీ వద్ద ప్లాట్లు వేసి నిర్మాణాలు జరిపారు. అంకణం (72 చదరపు అడుగులు) రూ. 3 లక్షలకు పైగా విక్రయించారు. మహేశ్వరనగర్, పరమేశ్వర నగర్, ఇరుకళల పరమేశ్వరీ ఆలయం, కుద్దూష్ నగర్ ప్రాంతాల వరకు అనేక నిర్మాణాలు చేశారు. అయినా కార్పొరేషన్‌ అధికారులు మౌనం వహించారు. కొండ్లపూడి, అక్కచెరువుపాడు, అంబాపురం వైపు నేటికి ఆక్రమణలు కొనసాగుతున్నాయి.

అసంపూర్తిగా ప్రభుత్వ కార్యాలయాల భవనాలు - కూటమి రాకతో ప్రజల్లో చిగురించిన ఆశలు - Vuyyuru Govt Offices

నెల్లూరు చెరువు ఆక్రమణలో ఉంది. వైఎస్సార్సీపీ నాయకులు గత ఐదేళ్లుగా ఆక్రమిస్తుంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. చెరువు సమీపంలో ఆక్రమంగా లేఅవుట్లు వేసి భవంతులు నిర్మించి ఇతరులకు అమ్మేశారు. చెరువులో పూడికలు కూడా తీసివేయాలి. భారీ వర్షాలు వస్తే విజయవాడలో ఏర్పడిన పరిస్థితే నెల్లూరు నగరంలో కూాడా తలెత్తుతుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలి - స్థానికులు

నిమ్మకు నీరెత్తినట్లు :అధికారులు గతంలో మొక్కుబడిగా సర్వేచేసి మార్కింగ్ చేయకుండా వదిలివేశారు. చెరువు, పంట కాలువలను ఆక్రమించడంతో గతంలో అనేకసార్లు నగరం ముంపునకు గురైందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు చర్యలు తీసుకుని చెరువును కాపాడాలని కోరుతున్నారు.

అధికారుల తప్పిదాలు - పోలవరం నిర్వాసితుల జీవితాల్లో తొలగని కష్టాలు - POLAVARAM COMPENSATION problems

ABOUT THE AUTHOR

...view details