అధినేత అండతో రెచ్చిపోయిన యువనేత - అభివృద్ధిలో నిల్ - అవినీతి ఫుల్ (ETV Bharat) YSRCP Leaders Irregularities : వైఎస్సార్సీపీ అధినేత జగన్ మొప్పు పొందటం ఆ పార్టీ నేతలకు అంత ఈజీ కాదు. కానీ బూతుల్లో మాస్టర్స్, అవినీతిలో ఆక్స్‌ఫర్డ్ డిగ్రీలు పొందిన నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువ ప్రజాప్రతినిధి మాత్రం తన టాలెంట్‌తో అధినేత మనసుకు దగ్గరయ్యారు. ఆయన అండ చూసుకుని ఆ యువనేత మరింత రెచ్చిపోయారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రెండున్నరేళ్లు రాష్ట్రస్థాయి పదవి వెలగబెట్టిన ఆ నేత అక్రమార్జనలోనూ ముందున్నారు. 'ఎప్పుడొచ్చాం అనేది కాదన్నయ్యా ఎంత దోచుకున్నామా' అన్నది ముఖ్యమన్నట్లు దందా సాగించారు. క్వా ర్ట్జ్, ఇసుక, గ్రావెల్, అక్రమ లేఅవుట్లు సహా చివరికి కరోనా వైద్యం పేరిట ఆరోగ్యశ్రీ బిల్లుల్నీ కాజేశారు. దోపిడీలో తనపర భేదం లేకుండా సొంత పార్టీ నేతల నుంచీ పన్నులు వసూలు చేశారు. కుదరదన్న నేతల వాహనాలను సీజ్ చేయించారు. ఆయన ఆగడాలు భరించలేకే సొంతపార్టీ ఎంపీ, మంత్రులే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈసారి నెల్లూరు ప్రజలు ఆయనకు బుద్ధిచెబుతారని గ్రహించిన జగన్ రెండు జిల్లాలు దాటించేశారు.
YCP MLA Anil Akramala Documents: "ఇవిగో అనిల్ కుమార్ అక్రమాల చిట్టా".. ఆధారాలు రిలీజ్ చేసిన లోకేశ్
అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న క్వా ర్డ్జ్‌పై నెల్లూరు జిల్లా వైసీపీ నేతల కన్ను పడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నేతలు ఎవరికి నచ్చినట్లు వారు దోచుకోవడం ప్రారంభించారు. అది తెలిసిన ఆ యువ నేత ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తవ్వకాలపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వాటికి అడ్డుకట్ట పడింది. ఇదంతా ప్రభుత్వ సంపద కాపాడేందుకే అనుకుంటే పొరబడినట్లే.
తాను కాకుండా వారంతా దోచుకుంటున్నారన్నదే ఆయన ఆవేదన. ఆపై అనుచరులను రంగంలోకి దింపి దందా మొదలుపెట్టడంతో నెల్లూరు ప్రజలంతా నివ్వెరపోయారు. ఊటుకూరు, సైదాపురం, మర్లపూడి, తిప్పిరెడ్డిపల్లి, జోగిపల్లి వంటి పది గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో అక్రమ తవ్వకాలకు తెరతీశారు. రోజుకు 100కి పైగా లారీల్లో ఖనిజాల్ని తరలింపు చేపట్టారు. ఆయన కాకుండా ఆ ప్రాంతంలో ఇతరులెవరైనా తవ్వకాలు చేపడితే టన్నుకు 7 వేల చొప్పున పన్ను కట్టాల్సిందే. ఈ దోపిడీలో సొంత పార్టీ నేతల నుంచీ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఒకసారి ఎదురు తిరిగిన అదే జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి లారీలను అధికారులతో సీజ్ చేయించారు. ఇలా అక్రమ తవ్వకాల్లో 500 కోట్లకు పైగా దోచుకున్నట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
Anam Venkataramana Reddy on Anilkumar: "ఐపీఎల్ బెట్టింగ్, డ్రగ్స్ సరఫరాలో తాడేపల్లి ప్యాలెస్‌కు వాటా"
పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. జిల్లాలో ఇసుక రీచ్‌లకు అనుమతి లేదని తెలుసుకుని ప్రతి వాహనం నుంచి సొంతంగా పన్ను వసూలు చేశారు. జగనన్న కాలనీలకు మెరక పేరిట మట్టి కొల్లగొట్టారు. నెల్లూరు గ్రామీణ పరిధిలో కాల్వల భూములను ఆక్రమించి ఆరు ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఆయకట్టు రైతులు కోర్టుకు వెళ్లగా ఆక్రమణలు తొలగించాలని న్యాయస్థానం ఆదేశించినా ఇప్పటికీ చర్యలు లేవు. జాయింట్ కలెక్టర్ రెండేళ్ల క్రితమే విచారణ జరిపి నివేదిక ఇచ్చినా ఇప్పటికీ ఆ నివేదికలో అంశాలు బయటకు రాలేదు. ఆ అక్రమ లేఅవుట్‌లో స్థలాలు కొనుగోలు చేసిన వారు నిర్మాణాలు చేపడుతుండగా విద్యుత్ అధికారులు కనెక్షన్లు కూడా ఇచ్చేస్తున్నారు. ఇందుకూరులోనూ ఐదు ఎకరాలకే అనుమతి తీసుకుని పది ఎకరాల్లో లేఔట్ వేశారు. దీనిపైనా ఫిర్యాదులు రావడంతో అక్రమ లేఅవుట్ అని అధికారులు బోర్డు పెట్టగా గంటలోనే దాన్ని తొలగించేశారు.
పెన్నా పొర్లుకట్ల పనుల్లోనూ ఈ ప్రజాప్రతినిధి చేతివాటం ప్రదర్శించారు. టెండర్‌లో తనకు అనుకూలమైన సంస్థకు 84 కోట్లకు పనులను అప్పగించారు. అలాగే 93 కోట్లతో సర్వేపల్లి రిటైనింగ్ వాల్, 75 కోట్లతో జాఫర్ సాహెబ్ కాల్వ గోడల పనులను సైతం ఈ యువనేత మరో గుత్తేదారుడితో కలిసి చేస్తున్నారని సమాచారం. ఆ గుత్తేదారు బంధువు ఒకరు, ఈడీలో పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరోనాలో ప్రజల భయాన్నీ సదరు నేత సొమ్ము చేసుకున్నారు. చిన్న ఆసుపత్రులను లీజుకు తీసుకొని కొవిడ్ చికిత్సకు అనుమతులు తెప్పించుకున్నారు. కరోనా వచ్చినా రాకపోయినా.. ఆసుపత్రుల్లో చేర్చుకుని ఆరోగ్య శ్రీ కింద బిల్లులు కాజేశారు. కొవిడ్ చికిత్సకు వాడే రెమెడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌ల పేరెత్తితే అందరికీ ఈ ప్రజాప్రతినిధే గుర్తుకొస్తారు.
నెల్లూరులో దారుణం.. అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేత.. బాధితుల ఆందోళన