Thief Went To Robbery And Died at Lift Room in Vizianagaram : విద్యుత్తు తీగలు, ఎలక్ట్రికల్ సామగ్రి దొంగలించడానికి అయిదో అంతస్తుకు వెళ్లిన దొంగ అనుకోకుండా మృత్యువాత పడ్డారు. లిఫ్ట్ నిర్మించడానికి కేటాయించిన గది అని తెలియక అందులోనూ సామగ్రి ఉంటుందని భావించి తలుపులు తీశాడు. కాలు పెట్టగానే ఒక్కసారిగా కిందకు పడిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన విజయనగరంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని అశోక్‌నగర్ ప్రాంతానికి చెందిన జి.శంకర్ (24), అదే ప్రాంతానికి చెందిన ఎం.సాయి, మరో బాలుడు కలిసి ఉమా రామలింగేశ్వర ఆలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఆసుపత్రిలోకి చోరీకి వెళ్లారు.
అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ సామగ్రి, విద్యుత్తు తీగలు దొంగిలించి వారి వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో నింపారు. అయిదో అంతస్తులోని తీగలు కత్తిరించేందుకు అక్కడే ఉన్న బల్ల తీసుకెళ్లారు. ఆ అంతస్తులోని ఒక గదిని చూసి అందులోనూ వివిధ సామగ్రి ఉంటుందని భావించిన శంకర్ ఆ గది తలుపులు తీశాడు. అది లిఫ్ట్ నిర్మించడానికి కేటాయించిన గది అని తెలియక అందులో కాలు పెట్టగానే ఒక్కసారిగా ఆ బల్లతో పాటు కిందకు పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.
అంత క్యాష్ ఎక్కడిది ? షాక్‌కు గురైన వ్యాపారి - తేరుకునేలోగా
కట్టుకథ అల్లిన దొంగలు : శంకర్ మృతిచెందడంతో ఎక్కడ చేసిన తప్పు బయటకు వచ్చేస్తుందో అని భయపడిన మిగిలిన ఇద్దరు వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. నిర్మాణంలో ఉన్న భవనంలో ఎవరో హత్య చేసి పడేసి వెళ్లిపోయారని ఓ కట్టుకథ అల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. వెంటనే నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలను అలర్ట్ చేసి సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఈ ముగ్గురు కలిసి వెళ్లినట్లు దృశ్యాలు బయటపడ్డాయి.
దీంతో అనుమానం వచ్చి మిగిలిన ఇద్దరినీ ఆరా తీయగా జరిగిన విషయమంతా బయటపెట్టేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహారాజా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ సీఐ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. మృతుడు శంకర్‌కు భార్య రాజేశ్వరి, ఏడాదిన్నర బాబు ఉన్నారు.
'జులాయి' సినిమాను తలపించేలా! - SBIలో భారీ దోపిడీ
డమ్మీ తుపాకీతో బెదిరించి బంగారం దోపిడీ - ఛేజింగ్ చేసిన పోలీసులు