Leopard Comes Up Road At Science Center Near Tirupati Zoo Park : తిరుపతిలో ఓ చిరుత పులి రోడ్డుపైకి రావటం కలకలం రేపింది. జూ పార్క్ సమీపంలోని సైన్స్ సెంటర్ వద్ద చిరుత పులి ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో భయాందోళనతో ఓ వ్యక్తి ద్విచక్రవాహనం నుంచి కిందపడ్డాడు. అతనికి గాయాలు కాగా అక్కడే ఉన్న కొంతమంది రుయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి టీటీడీ అశ్విని మెడికల్ హాస్పిటల్లో పనిచేస్తున్న మునికుమార్గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనతో అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్డు మార్గంలో ప్రయాణించే వారు భయభ్రాంతులకు గురవుతున్నారు.
తిరుపతిలో రోడ్డుపైకి వచ్చిన చిరుత - ఓ వ్యక్తికి గాయాలు - LEOPARD ON ROAD IN TIRUPATI
తిరుపతి జూ పార్క్ సమీపంలో ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చిన చిరుత పులి - భయాందోళనతో బైక్పై నుంచి కిందపడి గాయాలపాలైన ద్విచక్రవాహనదారుడు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2025, 7:01 AM IST