ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమ్మా వెళ్లొద్దు- భోజనాలు ఉన్నాయి-ఆగండి' జనాలను నిలువరించేందుకు వైసీపీ ప్రయత్నాలు - YCP LEADER ELECTION CAMPAIGN - YCP LEADER ELECTION CAMPAIGN

YSRCP Leaders election Campaign food distribution in AP : వైసీపీ ఎన్నికల సభలో పదేపదే భోజనాల ప్రస్తావన తీసుకురావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జనాలు నిలువరించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఇంటి బాట పట్టకుండా భోజనాలు ఉన్నాయంటూ ఎర వేస్తున్నారు.

ycp_leader_campaign
ycp_leader_campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 1:34 PM IST

Updated : Apr 2, 2024, 1:43 PM IST

'అమ్మా వెళ్లొద్దు- భోజనాలు ఉన్నాయి-ఆగండి' జనాలను నిలువరించేందుకు వైసీపీ ప్రయత్నాలు

YSRCP Leaders election Campaign food distribution in AP : వైసీపీ నాయకుల సభలు, రోడ్​షోలు అన్నా ప్రజలు చిరేత్తి పోతున్నారు. వారి సమావేశాల్లో పాల్గొనాలనే ఆసక్తి కనపరచడం లేదు. నాయకుల ప్రసంగాలు మధ్యలోనే ఇంటి బాట పడుతున్నారు. వారిని ఆపేందుకు వైసీపీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఒక దశలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడనైనా చూడండి అనే స్థాయిలో బతిమాలుకోవాల్సి వస్తోంది. అందరికీ భోజనాలు ఉన్నాయి ఆగండి ఆగండి వెనక్కి రండి అని వేడుకునే పరిస్థితి ఏర్పడింది.

ర్యాలీలు, రోడ్​షోలు, సమావేశాలతో ఎన్నికల ప్రచారం - గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వ్యూహం - AP Election Campaign

YCP Leaders : వైసీపీ ఉద్దండులు విజయసాయి రెడ్డి అయినా, వైవీ సుబ్బారెడ్డి ఎవరైనా అధికార నాయకుల ఎన్నికల ప్రచారంలో జనాలను నిలబెట్టేందుకు భోజనాల ప్రస్తావన తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ఎన్నికల సభల నుంచి ప్రజలు బయటకు వెళ్లకుండా నిలువరించేందుకు విశాఖ నేతలు వారికి భోజనాలను ఎర వేస్తున్నారు. అధికార నేతల గంటల తరబడి ప్రసంగాలను వినలేక ప్రజలు ఇంటి దారి పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. "ఇదీ YSRCP దుస్థితి" - భోజనాలు ఉన్నాయి, బిర్యానీ పెడతాం వెళ్లొద్దూ అంటూ వేడుకోలు - MP Vijayasaireddy Election Campaign

YV Subba Reddy Election Campaign in Visakha District : విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో అవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి నేతలు సన్మానం చేస్తున్న క్రమంలో అప్పటికే విసుగెత్తిపోయిన ప్రజలు ఇంటికి తిరుగుబాట పట్టారు. దానిని గమనించిన ఓ వ్యక్తి అమ్మా భోజనాలు ఉన్నాయి ఎవరూ వెళ్లొద్దూ అంటూ మైక్‌లో చెప్పారు. వెంటనే అవంతి శ్రీనివాసరావు కలుగ చేసుకుని అలా చెప్పొద్దని వారించారు. ఇలాంటి నేపథ్యంలో భీమిలి వైసీపీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు టీడీపీ నేత కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావును హెచ్చారించిన విషయం స్థానికంగా వివాదస్పద కరంగా మారింది.

Vijayasai Reddy Election Campaign in Nellore District : ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ప్రసంగిస్తూ ఉండగా ప్రజలు వెనుదిరిగిన విషయం అందరికి తెలిసిందే. మళ్లీ ఇలాంటి సంఘటన పునరావృతం అవ్వడం గమనార్హం. అధికార నాయకుల సభలు, సమావేశాల్లో భోజనాల ప్రస్తావన లేనిదే వైసీపీ నేతల ప్రచారం జరగటం లేదని కొంత మంది నవ్వుకుంటున్నారు.

'మేం అనుమతి తీసుకోవాలా?!'- కోడ్​ ఉల్లంఘించి వైసీపీ నేతల ప్రచారం, ర్యాలీలు

Last Updated : Apr 2, 2024, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details