YSRCP Leaders Attack on Family in Visakha :ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని సామాన్యులపై దాడులకు చేయడాన్ని ఇప్పటివరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. వైఎస్సార్సీపీ నేతల వల్ల ఈ సంస్కృతి ప్రశాంతతకు మారుపేరైనా ఉత్తరాంధ్రకి పాకింది. వైఎస్సార్సీపీకి ఓటేయలేదని ఆ పార్టీ నాయకులు విశాఖలోని బర్మా కాలనీలో ఒక కుటుంబంపై దాడి చేశారు. ఉక్కుపాదంతో అణచివేయాల్సిన పోలీసులు దాన్నో కుటుంబ తగాదాగా చిత్రీకరించి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనల్ని సిట్ దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
దాడి జరిగిందని బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేద్దమని వెళ్తే ఆయన లేరు. సంయుక్త కలెక్టరేమో కమిషనర్‌కి ఫిర్యాదు చేయమని చెప్పారు. దీంతో ఫిర్యాదు ప్రతిని ఎన్నికల సంఘానికి, రాష్ట్ర డీజీపీ పంపిస్తామని బాధితులు తెలిపారు.
ఎన్డీయే అభ్యర్థికి ఓటెలా వేస్తారు :టీడీపీ హయాంలో తమకు ఇల్లు మంజూరైందని ఇంటి ముందు అమర్చిన శిలాఫలకంలో ప్రధాని మోదీ, అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చిత్రాలున్నాయని బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు. ఇంటి ముందు కిళ్లీ కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని వైఎస్సార్సీపీ మద్దతుదారులైన లోకేశ్, భూలోక, సాయి, భాస్కర్, చిన్ని, ఆశ అనే వ్యక్తులు, మరికొందరితో కలసి ఈ నెల 15న రాత్రి మద్యం తాగి కొట్టు దగ్గరికి వచ్చారని పేర్కొన్నారు.