YSRCP Leader Accused in Murder Case:విజయవాడకు చెందిన ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో వైఎస్సార్సీపీ నేత, ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి పోలీసుల ఎదుట హాజరయ్యారు. నగరంలో కలకలం రేపిన ఈ హత్యాయత్నం కేసులో కీలక సూత్రదారి అయిన ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత పూరనూరు గౌతమ్‌రెడ్డి సత్యనారాయణపురం పోలీస్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. రూ. కోట్ల విలువైన స్థలం కబ్జా కేసులో బాధితుడు గండూరి ఉమామహేశ్వరశాస్త్రి గత నెల 6వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
విజయసాయి రెడ్డిని విచారించాల్సిందే - హైకోర్టులో అప్పీలు చేసిన ఐసీఏఐ
హత్యాయత్నం కేసులో వైఎస్సార్సీపీ నేత:ఉమామహేశ్వర శాస్త్రిని హతమార్చేందుకు ఓ ముఠాతో కలిసి గౌతమ్‌రెడ్డి రూ.25 లక్షలకు ఒప్పందం కుదర్చుకున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తునకు సహకరించాలని ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు అధికారి విజయవాడ నార్త్ ఏసీపీ స్రవంతి రాయ్ ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన మంగళవారం రాత్రి ఆమె ఎదుట హాజరయ్యారు. ఘటనకు సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కేసుకు సంబంధించి మొత్తం 9 మంది నిందితుల్లో ఇప్పటికే ఏడుగురు అరెస్టు అయ్యారు. వీరి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా వైకాపా నేతను ఏసీపీ ప్రశ్నించారు. మొత్తం పది ప్రశ్నలు అడగ్గా పొడిపొడిగా సమాధానం చెప్పినట్లు తెలిసింది.