Chandrababu in Naravaripalle: నారావారిపల్లెలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు తొలుత గ్రామదేవత గంగమ్మకు చంద్రబాబు కుటుంబం పూజలు చేశారు. నాగాలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్తో కలిసి సీఎం పూజలు నిర్వహించారు.
తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు: అనంతరం నారావారిపల్లెలో తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు. అదే విధంగా నారావారిపల్లెలో చంద్రబాబు ఇంటి వద్ద బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.